Big Stories

Ram Pothineni Movie Update: మహేష్ బాబు డైరెక్షన్‌లో రామ్ పోతినేని కొత్త మూవీ..?

Director Mahesh Babu Ram Pothineni’s Combo: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఫుల్ జోష్‌ మీద ఉన్నాడు. వరుస సినిమాలను లైన్‌లో పెట్టాశాడు. అందులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీపై భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి. గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ తెరకెక్కుతోంది.

- Advertisement -

ఈ మూవీలో బాలీవుడ్ బడా యాక్టర్ సంజయ్ దత్ విలన్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు అమాంతంగా పెంచేశాయి. ఫస్ట్ పార్ట్‌ కంటే సెకండ్ పార్ట్ మరింత థ్రిల్లింగ్‌గా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇస్మార్ట్‌ శంకర్ మూవీకి అదిరిపోయే మ్యూజిక్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్‌కి కూడా సంగీతం అందిస్తుండటంతో హైప్ బాగా క్రియేట్ అయింది.

- Advertisement -

ఈ డబుల్ ఇస్మార్ట్‌ మూవీని దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీలో రామ్ పోతినేని సరసన అందాల ముద్దుగుమ్మ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే రామ్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రామ్ పోతినేని తాజాగా ఓ యంగ్ డైరెక్టర్‌ను ఓకే చెప్పినట్లు టాక్ నడిస్తోంది.

Also Read: ‘డబుల్ ఇస్మార్ట్’ బర్త్ డే ట్రీట్.. అదరహో అనిపించిన రామ్ పోతినేని!

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేం మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. దీంతో రామ్ పోతినేని – మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఈ మూవీ క్లాసికా లేక మాస్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇదే లైనప్‌లో డైరెక్టర్ త్రివిక్రమ్‌తో కూడా రామ్ పోతినేని ఓ మూవీ చేస్తాడని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News