BigTV English

Remedies for Cold and Caught: వానాకాలంలో ఈ కషాయం తాగితే దగ్గు, జలుబు ఇట్టే మాయం

Remedies for Cold and Caught: వానాకాలంలో ఈ కషాయం తాగితే దగ్గు, జలుబు ఇట్టే మాయం

Kashayam for Cold and Cough in Rainy season: వానాకాలం వచ్చిందంటే చాలు దగ్గు, జలుబుతో చాలా మంది ఇబ్బంది పడతారు. వర్షాకాలంలో సాధారణంగా జలుబు, దగ్గు సమస్యలు పిల్లలతో పాటు పెద్దలను ప్రభావితం చేస్తాయి. ఈ సమస్యలకు సాధారణ చిట్కాలు కూడా ఉన్నాయి. మెడికల్ షాపులోకి వెళ్లి మందులు తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి సమయంలో కషాయం తాగితే మంచి ఫలితం ఉంటుంది.


సాధారణ జలుబు, దగ్గుకు సమర్థవంతమైన నివారణిగా కషాయం పనిచేస్తుంది. దీనిని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. దగ్గు, జలుబు తగ్గడం కోసం కషాయం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు  తెలుసుకుందాం.

ఒక అర చెంచా పసుపుపొడి, అర చెంచా అల్లం పొడి లేదా అర చెంచా పచ్చి అల్లం, లవంగాల పొడి, అరస్పూన్ దాల్చిన చెక్క పొడులను కలిపి ఈ మిశ్రమంలో కాస్త నీళ్లు పోసి ఐదు నిమిషాలు మరిగించాలి. ఈ తర్వాత స్టౌ ఆఫ్ చేసి అందులో కాస్త నిమ్మ రసం, ఒక చెంచా తేనె కలిపి దీన్ని రోజుకు రెండు సార్లు తాగితే దగ్గు, జలుబు మాయం అవుతుంది.


Also Read: Hazelnut Benefits: డయాబెటిస్ ఉన్న వాళ్లు.. హాజెల్ నట్స్ తింటే ఎంత మంచిదో

పసుపు:
యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పసుపులో ఎక్కువగా ఉంటాయి. బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి పసుపు సహాయపడుతుంది. ఇది దగ్గు, జలుబును తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది.

అల్లం:
జలుబు, దగ్గు సమస్యలకు అల్లం దివ్యౌషధం. అల్లం అనేక గృహ అవసరాలకు వాడుతుంటారు. అల్లం  గొంతు నొప్పి విపరీతమైన చికాకు కలిగించే దగ్గును తగ్గిస్తుంది. వర్షాకాలంలో క్రమం తప్పకుండా అల్లం వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Also Read: Salt Importance For Health: ఉప్పు తక్కువగా తింటే ఏం అవుతుందో తెలుసా..

నిమ్మరసం:
నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబును నివారించడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.

దాల్చిన చెక్క పొడి:
దాల్చిన చెక్క పొడి గొంతు నొప్పి నివారించడంలో సహాయపడుతుంది. కొంతమందికి ఈ చెక్క వాసన అస్సలు నచ్చదు. అలాంటి వారు దీనిని తీసుకోవడం గురించి ఆలోచించాలి. ఈ చెక్కను ఉపయోగించడం ద్వారా అనేక ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని గమనించాలి.

Also Read: శనగపిండితో నలుగు.. ఇలా వాడితే మెరిసే చర్మం మీ సొంతం

తేనె:
జలుబు, దగ్గును తగ్గించడానికి తేనె ఎంతగానో ఉపయోగపడుతుంది. కషాయంలో తేనెను తప్పకుండా వాడాలి. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు క్రిములతో పోరాడడానికి ఉపయోగపడతాయి.

కషాయాలను తీసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సాధారణ జలుబు, దగ్గు కోసం వీటిని ప్రయత్నించవచ్చు. కచ్చితంగా కషాయం మంచి ఫలితాలను ఇస్తుంది.

Tags

Related News

Stomach Pain: ఇలా చేస్తే.. క్షణాల్లోనే కడుపు నొప్పి మాయం

Instant Energy: తరచూ అలసటగా అనిపిస్తోందా ? ఈ టిప్స్ పాటిస్తే.. ఫుల్ ఎనర్జీ

Hair Mask: సిల్కీ జుట్టు కోసం.. బెస్ట్ హెయిర్ మాస్క్ !

Eyebrows: ఐబ్రోస్ ఒత్తుగా పెరగాలంటే ?

Alum: పటికతో.. ఇన్ని ఉపయోగాలా ?

Wrinkles: చిన్న వయస్సులోనే.. ముఖంపై ముడతలా ? ఈ టిప్స్ పాటించండి !

Big Stories

×