BigTV English
Advertisement

Best Face Packs: ఫేస్ క్రీమ్‌లు అవసరమే లేదు.. వీటితో రెట్టింపు అందం

Best Face Packs: ఫేస్ క్రీమ్‌లు అవసరమే లేదు.. వీటితో రెట్టింపు అందం

Best Face Packs: ముఖం అందంగా మెరుస్తూ ఉండాలని అందరూ అనుకుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు మెరిసే చర్మం కోసం మార్కెట్‌లో దొరికే రకరకాల ఫేస్ ప్యాక్‌లను వాడుతూ ఉంటారు. వీటి వల్ల కొన్ని సార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే కొన్ని రకాల హెం మేడ్ ఫేస్ ప్యాక్స్ వాడటం మంచిది. వీటితో మీ స్కిన్ మెరిసిపోతుంది. వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు కూడా. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలి ? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


తేనె, నిమ్మకాయ ఫేస్ ప్యాక్:
తేనె- 1 టీ స్పూన్
నిమ్మరసం- 1 టీ స్పూన్

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో తేనె, నిమ్మరసం తీసుకుని పేస్ట్ లాగా చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి. ఇందులో ఉండే తేనె చర్మాన్ని తేమగా మారుస్తుంది. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి.


బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్:

బొప్పాయి గుజ్జు- 1 టేబుల్ స్పూన్
తేనె- 1 టీ స్పూన్
తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో బొప్పాయి గుజ్జు, తేనెను కలిపి మిక్స్ చేసి ముఖానికి పట్టించండి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేయండి. బొప్పాయి చర్మానికి చాలా మేలు చేస్తుంది . ఇది మచ్చలను తగ్గించడమే కాకుండా, చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో, చర్మం ఛాయను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తేనె కూడా నల్ల మచ్చలను తగ్గిస్తుంది. మీ చర్మాన్ని తేమగా చేస్తుంది.

Also Read: మీ ముఖం అందంగా మెరిసిపోవాలా ? అయితే ఈ ఫేస్ మాస్క్ ట్రై చేయండి

కుంకుమపువ్వు, పసుపు ,శనగపిండి ఫేస్ ప్యాక్:

కుంకుమపువ్వు కొద్దిగా, 1 టీ స్పూన్ పసుపు, శనగపిండిలను మిక్స్ చేసి ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది లోపలి నుండి ముఖాన్ని ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది. కుంకుమపువ్వు రంగును మెరుగుపరుస్తుంది. పసుపు చర్మపు మచ్చలను తేలికపరుస్తుంది. శనగ పిండి చనిపోయిన చర్మ కణాలను క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేయడం వల్ల మీ చర్మం మెరుస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Criticism: పదే పదే మిమ్మల్ని విమర్శిస్తున్నారా.. సానుకూల ధోరణే సరైన పరిష్కారం!

Mental Health: ఈ లక్షణాలు మీలో ఉంటే.. మానసిక ఆరోగ్యం దెబ్బతిన్నట్లే ?

Air Pollution: పిల్లల్లో ఈ సమస్యలా ? వాయు కాలుష్యమే కారణం !

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా వాడితే.. పూర్తిగా షుగర్ కంట్రోల్

Surya Namaskar benefits: సర్వరోగాలకు ఒకటే పరిష్కారం.. ఆరోగ్యంతో పాటు సమయమూ ఆదా!

Feeding Mistakes: ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ అన్నం తినిపిస్తున్నారా.. నిపుణులు ఏమంటున్నారంటే?

Exercise: రోజూ వ్యాయామం చేయడానికి టైం లేకపోతే.. వీకెండ్ వారియర్స్‌గా మారిపోండి!

Village style Fish Pulusu: విలేజ్ స్టైల్ లో చేపల పులుసు చేశారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు, రెసిపీ అదిరిపోతుంది

Big Stories

×