అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే అరటి పండ్లను కడిగి తినేవారు ఎవరూ ఉండరు. ఆపిల్ పండ్లను, కివీ పండ్లను శుభ్రం చేసుకున్నకే తింటారు. కానీ అరటి పండ్లు కడగకపోవడానికి కారణం పైన మందపాటి తొక్క రక్షణగా ఉంటుందని భావిస్తారు. అయితే పోషకాహార నిపుణులు, వైద్యులు చెబుతున్న ప్రకారం అరటి పండ్లను కూడా కడిగే తినాలి.
మార్కెట్ నుండి అరటిపండ్లను తీసుకొచ్చాక వాటిని కొళాయి కింద పెట్టి ఒకసారి శుభ్రం చేశాకే పక్కన పెట్టాలి. లేకపోతే వాటి వల్ల కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇతర పండ్లు, కూరగాయలు మాదిరిగానే అరటిపండు కడగడం వల్ల ధూళి, పురుగుమందులు వంటివి తొలగిపోతాయని చెబుతారు. లోపలికి కూడా చేరుతాయని అంటారు.
మసాచుసెట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంస్థ చెబుతున్న ప్రకారం ఈగలు అరటి తొక్కలపై అధికంగా గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు మనకి కనిపించవు. అవి మనకు తెలియకుండానే ఇంటికి తీసుకురావడం వల్ల ఇంట్లో కూడా ఈగల సంఖ్య పెరిగిపోతుంది. అలాగే ఆ పండ్ల లోపలికి కూడా చిన్నచిన్న రంధ్రాల ద్వారా సూక్ష్మ క్రిములు చేరే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఈగల గుడ్లను తొలగించడానికి కచ్చితంగా అరటి పండ్లను కొళాయి కింద పెట్టి శుభ్రం చేయాలని చెబుతున్నారు.
అరటి పండ్లను ఎందుకు కడగాలి?
ఈగలు, సూక్ష్మక్రిములు తియ్యటి చక్కెరకు ఆకర్షితులవుతాయి. అందుకే అరటి పండ్లు ఈగలకు ఎంతో ఇష్టం. అవి తియ్యగా ఉంటాయి. మీ కంటికి కనిపించకపోయినా అరటిపండులపై కచ్చితంగా సూక్ష్మక్రిముల కూడా గుడ్లు పెట్టే ఉంటాయి. ఈగ గుడ్లు కూడా అరటిపండ్లపై ఉంటాయి. మీరు అరటి పండ్లు ఉన్నచోట ఈగల మూగడం చూస్తారు. వాటి గుడ్లు వాటిపై అధికంగా ఉంటాయి. కాబట్టి ఈగలు అలా తిరుగుతూ ఉంటాయి.
అరటిపండును కడగడానికి చల్లని నీటిని మాత్రమే ఉపయోగించాలి. లేదా గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని ఉపయోగించాలి. వేడి నీళ్లు ఉపయోగించటం వల్ల అవి త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. ఈగ గుడ్లు తొలగిపోవాలంటే ఒకసారి చేత్తోనే వాటిని గట్టిగా రుద్దాలి. అలాగే పొడిగా ఉన్న టవల్ తో తుడవాలి. ఇలా చేయడం వల్ల అరటి తొక్కపై ఉన్న సూక్ష్మ క్రిములు, ఈగల గుడ్లు తొలగిపోయే అవకాశం ఉంది.
Also Read: బాయ్స్ బెడ్ మీద రెచ్చిపోవాలా? ఈ దేశీ ఫుడ్స్ ట్రై చేయండి!
ప్రతిరోజూ అరటిపండ్లను తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అరటి పండులో ఉండే ఫైబర్ ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని కూడా అందిస్తుంది. కండరాల నొప్పులు తగ్గాలన్నా కూడా అరటిపండు తింటే మంచిది. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తింటే చాలు. ఎక్కువ తింటే బరువు పెరిగే అవకాశం ఉంది. అలాగే ఛాతీలో కఫం పట్టే అవకాశం ఉంది. అరటిపండులో కార్బోహైడ్రేట్లు, చక్కెర కూడా అధికంగా ఉంటాయి కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ పండును తినకూడదు. సన్నగా ఉన్నవారు అరటి పండును తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.