BigTV English

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Causes Of Pimples: మొటిమలు రావడానికి కారణాలు ఇవే !

Causes Of Pimples: చాలా మంది ప్రస్తుతం ముఖంపై మొటిమల సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖంపై తరచుగా మొటిమలు రావడం వల్ల కొన్నిసార్లు ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతుంది. ముఖంపై మొటిమలు వస్తే మాత్రం ముందుగా వాటికి గల కారణాలను గురించి తెలుసుకోండి.


మొటిమలు రావడానికి గల కారణాలు..

ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన, అందమైన చర్మాన్ని కోరుకుంటారు. ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం, క్రమరహిత జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, టెన్షన్ ప్రభావాలు శరీరంపై కనిపించడం ప్రారంభిస్తాయి. ఫలితంగా ముఖంపై మొటిమలు పెరుగుతాయి. ముఖం మీద మొటిమలు పదేపదే పెరగడం ఆత్మ విశ్వాసం కోల్పోతారు. కానీ ఇలాంటి సమయంలోనే ముఖంపై మళ్లీ మళ్లీ మొటిమలు రావడానికి గల కారణాలను తెలుసుకోవడం చాలా అవసరం.


హార్మోన్లలో మార్పు:
హార్మోన్ల అసమతుల్యత కారణంగా మొటిమలు వస్తాయి. ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్నప్పుడు. పీరియడ్స్, గర్భధారణ సమయంలో కూడా మొటిమలు రావడం ప్రారంభమవుతుంది. హార్మోన్లు సమతుల్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఐరన్ , విటమిన్ బి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత అనేక అనారోగ్య సమస్యలకు కూడా కారణం అవుతుంది.

జంక్ ఫుడ్:
చెడు ఆహారం తినడం వల్ల కూడా ముఖంపై మొటిమలు పెరుగుతాయి. జంక్ ఫుడ్, ఎక్కువ చక్కెర ఉన్న ఆహార పదార్థాలు తినడం, పాల ఉత్పత్తులు, నిల్వ చేసిన ఆహార పదార్థాలు కూడా మొటిమలను పెంచుతాయి. అందుకే చర్మ సౌందర్యం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

టెన్షన్:
అధిక ఒత్తిడి, టెన్షన్ కారణంగా, శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మొటిమలకు కారణమవుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అంతే కాకుండా ఒత్తిడి తగ్గడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి.

ఆరోగ్య సమస్యలు:
జీర్ణవ్యవస్థ సమస్యలు, కడుపు నొప్పి, PCOS, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మొటిమలకు కారణం కావచ్చు. అందుకే అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి.

కాస్మెటిక్ ఉత్పత్తులు:

మేకప్, చర్మ సంరక్షణ ఉత్పత్తులలో రసాయనాలు ఉంటాయి. ఈ రసాయనాలు మీ చర్మానికి సూట్ అవ్వకపోతే చర్మ సంబంధిత సమస్యలు మొదలవుతాయి. ఫలితంగా ముఖంపై మొటిమలు కూడా వస్తుంటాయి.

Also Read: ముఖం తెల్లగా మెరిసిపోవాలంటే.. ఇవి వాడండి

పరిశుభ్రత పాటించకపోవడం:
చర్మ పరిశుభ్రత చాలా ముఖ్యం. ముఖం సరిగా కడుక్కోకపోవడం, మేకప్ తీయకపోవడం, మురికి దిండులపై పడుకోవడం, చర్మంపై రసాయనాలతో కూడిన రకరకాల ఫేస్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల మొటిమలు వచ్చే ప్రమాదం ఉంది.

ధూమపానం:
ధూమపానం, మద్యం సేవించడం వల్ల ముఖం రంగు మారుతుంది. దీని వల్ల ముఖంపై మొటిమలు, ముడతలు పెరుగుతాయి. అందుకే ధూమపానానికి దూరంగా ఉండటం మంచిది. తినే ఆహారం  మాత్రమే కాదు మద్యం కూడా  చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.  అందుకే వీలైనంత వరకు మధ్యానికి దూరంగా ఉండాలి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Brown rice Vs White rice: వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్, వీటిలో ఏది బెటర్ ?

Sensitive Teeth:పళ్లు జివ్వుమంటున్నాయా ? ఈ టిప్స్ ట్రై చేయండి

200 Year Old Condom: ఏంటీ.. ఈ కండోమ్ 200 ఏళ్ల నాటిదా? అస్సలు ఊహించి ఉండరు!

Heart Health: గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తినాలి ?

Jaggery water: ఉదయం పూట ఖాళీ కడుపుతో బెల్లం నీరు తాగితే.. ?

Pimple Removal Tips: మొటిమలు తగ్గాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి ?

Big Stories

×