E-Paper
Advertisement

Best Face Mask: పార్లర్‌కి వెళ్లాల్సిన పని లేదు.. వీటితో ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్ పక్కా !

Best Face Mask: పార్లర్‌కి వెళ్లాల్సిన పని లేదు.. వీటితో ఇంట్లోనే గ్లోయింగ్ స్కిన్ పక్కా !

Best Face Mask: పండగలు, ఫంక్షన్ల సమయంలో అందంగా కనిపించడం కోసం పార్లర్లకు పరుగులు పెట్టే వారు చాలా మందే ఉంటారు. పార్లర్లో వేలల్లో ఖర్చు పెట్టే వారు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే మరికొందరేమో ముఖంపై మెరుపును పెంచేందుకు అనేక ఖరీదైన సౌందర్య ఉత్పత్తులు మార్కెట్ నుంచి కొనుగోలు చేసి వాడుతుంటారు.

వీటిలో ఎక్కువ భాగం రసాయనాలతో తయారు చేసినవే ఉంటాయి. ఎక్కువ సార్లు వీటిని వాడితే చర్మం పొడి బారడంతో పాటు మెరుపును కోల్పోతుంది. ఇది మాత్రమే కాదు, చర్మంపై ముడతలు కూడా వస్తాయి. అందుకే పండగలు, ఫంక్షన్ల సమయంలో కొన్ని రకాల ఫేస్ మాస్కులను తయారు చేసుకుని వాడటం మంచిది. ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ మాస్కుల వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇవి ముఖంపై మెరుపును పెంచుతాయి. ఫంక్షన్ల సమయంలో తక్కువ సమయంలోనే వీటిని తయారు చేసుకుని వాడవచ్చు. వీటితో క్షణాల్లోనే ముఖం అందంగా మారుతుంది.

సహజ పదార్ధాలతో తయారు చేసిన ఫేస్ మాస్క్ చర్మానికి తేమను అందించడమే కాకుండా, తక్కువ సమయంలో చర్మాన్ని మెరిపిస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఫేస్ మాస్క్‌లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అరటిపండు, తేనె, పసుపుతో ఫేస్ మాస్క్:
కావలసినవి:
అరటిపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు
తేనె – 1 టీ స్పూన్
పసుపు- 1 టీ స్పూన్

తయారీ విధానం: పైన చెప్పిన మోతాదుల్లో ఒక గిన్నెను తీసుకుని అందులో అన్ని పదార్థాలను వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత దీనిని ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాలు ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడడం వల్ల ముఖం అందంగా మారుతుంది.

అరటిపండు, తేనె పసుపుతో చేసిన ఫేస్ మాస్క్ చర్మం మృదువుగా మార్చడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఈ నేచురల్ ఫేస్ మాస్క్ పొడి చర్మం ఉన్న వారికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అరటిపండులో విటమిన్ ఎ, బి, సి లభిస్తాయి. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి ఉపయోగపడుతుంది.పసుపు, తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ తో పాటు మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి తరుచుగా అప్లై చేయడం వల్ల మొటిమలు కూడా చాలా వరకు తగ్గుతాయి.

Also Read: చర్మం మిలమిలా మెరిసిపోవాలా ? అయితే వీటిని వాడండి

2. ఆరెంజ్ తేనె ఫేస్ మాస్క్..
కావలసినవి: 
ఆరెంజ్ జ్యూస్- 2 టేబుల్ స్పూన్లు
తేనె – 1 టీ స్పూన్

తయారీ విధానం: ఒక బౌల్ తీసుకుని పైన చెప్పిన మోతాదుల్లో ఆరెంజ్ జ్యూస్ తో పాటు తేనెను కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి.
ఆరెంజ్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఆరెంజ్ ఫేషియల్ ఆయిల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×