Homemade Shampoo: జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు ఇంట్లోనే షాంపూలను తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో కెమికల్స్ తో తయారు చేసిన షాంపూలతో పోలిస్తే ఈ హెర్బల్ షాంపూలు జుట్టు రాలకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి.
జుట్టు మృదువుగా , మెరిసేలా చేయడానికి షాంపూని ఉపయోగించడం సర్వసాధారణం. చాలా మంది మార్కెట్ లో దొరికే షాంపూని ఉపయోగిస్తారు. కానీ వీటిని రసాయనాలతో తయారు చేయడం వల్ల కొన్నిసార్లు ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతంది. అందుకే ఇంట్లోనే హెర్బల్ షాంపూ సులభంగా తయారు చేసుకుని వాడవచ్చు. మీరు కుంకుడు కాయ, షికాకాయ్, మెంతి గింజల వంటి వాటితో హెర్బల్ షాంపూని సులభంగా తయారు చేసుకోవచ్చు.
సహజమైన షాంపూలు జుట్టును సహజంగా బలంగా, మెరిసేలా చేయడంతో పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ షాంపూలను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టును బలోపేతం చేయడంతోపాటు మృదువుగా మారుస్తాయి.
షాంపూ తయారీ:
కావలసినవి:
కుంకుడు కాయలు – 10-12
షికాకాయ్ – 5-6
ఉసిరికాయ – 2-3
నీళ్లు – 2 కప్పులు
తయారీ విధానం: పైన చెప్పిన వాటన్నింటిని ఒక బౌల్ లో తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే గ్యాస్ పై మరిగించాలి. 15 నిమిషాల తర్వాత చల్లార్చి వడకట్టండి. అవసరమైనప్పుడల్లా జుట్టుకు పట్టించి తలస్నానం చేయండి.
మెంతి గింజలతో హెయిర్ ప్యాక్ :
కావలసినవి:
మెంతులు – 2 టీస్పూన్లు
నీరు – 1 కప్పు
తయారీ విధానం: మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే పేస్టులా చేసి జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. ఇందులోని పోషకాలు జుట్టు పెరిగేలా చేస్తాయి.
ఎగ్ షాంపూ:
కావలసినవి:
గుడ్డు- 1
నిమ్మరసం- 1 టీస్పూన్
తయారీ విధానం: ఎగ్ లో నిమ్మరసం వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు పట్టించి 30 నిమిషాల తర్వాత వాష్ చేయండి. పొడి జుట్టు కోసం గుడ్డు పచ్చసొన మరియు జిడ్డుగల జుట్టు కోసం గుడ్డు తెల్లసొన ఉపయోగించండి.
అలోవెరా షాంపూ..
కావలసినవి:
అలోవెరా జెల్ – 2 టీ స్పూన్లు
కొబ్బరి నూనె – 1 టీ స్పూన్లు
నిమ్మరసం – 1 టీ స్పూన్లు
తయారీ విధానం: అన్ని పదార్థాలను ఒక బౌల్ లో వేసి మిక్స్ చేసి తర్వాత జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత వాష్ చేయాలి. తరుచుగా ఇలా చేయడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు బాగా పెరుగుతుంది.
శనగపిండి షాంపూ:
కావలసినవి:
శనగపిండి – 2-3 టీస్పూన్
పెరుగు – 2-3 టీస్పూన్
నిమ్మరసం – 1 టీస్పూన్
తయారీ విధానం: అన్ని పదార్థాలను ఒక బౌల్‌లో వేసి మిక్స్ చేయండి. తర్వాత దీనిని జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత వాష్ చేయండి. తరుచుగా ఇలా చేయడం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా జుట్టుకు తగిన పోషణ కూడా లభిస్తుంది.
Also Read: మీ ముఖం చందమామలా మెరిసిపోవాలా ? అయితే ఇలా చేయండి
నేచురల్ షాంపూల వల్ల ప్రయోజనాలు:
జుట్టును సహజంగా దృఢంగా మార్చుతాయి.
చుండ్రును తొలగిస్తుంది.
జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.