Oils For Skin: చలికాలం అనేక సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపించడం ప్రారంభిస్తుంది.చల్లటి గాలులు, తక్కువ తేమ కారణంగా చర్మం తేమను కోల్పోతుంది. ఈ సమయంలో చర్మాన్ని కాపాడుకోవడం చాలా కష్టం.
ముఖ్యంగా చాలా మంది చలికాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించడం ప్రారంభిస్తారు. అయినప్పటికీ పెద్దగా తేడా కనిపించదు. కానీ కొన్ని ప్రత్యేకమైన నూనెలు చర్మానికి పోషణను అందిస్తాయి. వీటిని చలికాలంలో చర్మంపై అప్లై చేస్తే, మనకు రెట్టింపు గ్లో వస్తుంది. అంతేకాకుండా ఇవి మన చర్మానికి తేమ, పోషణను అందించడంలో సహాయపడతాయి.ఏ నూనెలు చర్మ సౌందర్యాన్నిరెట్టింపు చేయడంలో ఉపయోగపడతాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనె ముఖానికి క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్‌గా లాగా కూడా అప్లై చేయవచ్చు. దీనిని ఉపయోగించడం వల్ల చర్మం తేమగా మారుుతంది. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
ఆల్మండ్ ఆయిల్:
విటమిన్ ఇ,కె, కొవ్వు ఆమ్లాలు, బాదం నూనెలో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి పోషణను అందించడంలో సహాయపడతాయి. దీంతో పాటు, చర్మంలో తేమ తగ్గినప్పుడు భర్తీ చేయడంలో కూడా ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. బాదం నూనె ముఖ్యంగా పొడి, నిర్జీవ చర్మానికి చాలా మంచిదని భావిస్తారు. బాదం నూనెను రోజు చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా, మెరిసేలా చేస్తుంది. స్నానం చేసిన తర్వాత తప్పక అప్లై చేయాలి.
సన్‌ఫ్లవర్ ఆయిల్:
చలికాలంలో సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ముఖానికి రాసుకుంటే ముడతల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పొద్దుతిరుగుడు నూనె కూడా మొటిమల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. చలికాలంలో చర్మం పొడిబారడం వల్ల మీరు ఇబ్బంది పడుతుంటే, ఈ నూనె మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రాత్రి పడుకునే ముందు దీనిని ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ ఒక సహజమైన మాయిశ్చరైజర్. ఇది చర్మాన్ని లోతుగా పోషించడంలో సహాయపడుతుంది. ఇది చర్మంపై పొరలో తేమను లాక్ చేస్తుంది. దీని వల్ల చర్మం ఎక్కువ కాలం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మానికి ఆలివ్ ఆయిలం రాయడం వల్ల స్కిన్ తేలికగా వేడెక్కడం జరుగుతుంది. ఈ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల చర్మానికి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి.
అవోకాడో ఆయిల్:
అవోకాడో నూనెలో విటమిన్ ఇ, విటమిన్ ఎ , కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ నూనె చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోయి హైడ్రేట్ చేస్తుంది. అవకాడో నూనెను చలికాలంలో తప్పనిసరిగా అప్లై చేయాలి. దీంతో చర్మానికి సహజసిద్ధమైన మెరుపు వస్తుంది.
Also Read:ఇది ఒక్కసారి వాడితే చాలు.. జుట్టు పెరగడం గ్యారంటీ!
చలికాలంలో నూనెలు వాడే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి:
నూనెను అప్లై చేయడానికి ముందు చర్మాన్ని పూర్తిగా శుభ్రం చేయండి.
తేలికగా నూనెను మసాజ్ చేయండి.
స్నానం చేసిన వెంటనే నూనె రాయాలి.
పడుకునే ముందు కూడా నూనె అప్లై చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.