Long Hair Tips: జుట్టు బలహీనంగా మారడం, రాలిపోవడం వల్ల చిన్న వయస్సు వారికి నేడు ప్రధాన సమస్యగా మారిపోయింది. 20 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న చాలా మంది నిర్జీవమైన జుట్టు, తెల్ల జుట్టు సమస్యతో పోరాడుతున్నారు. జుట్టు పెరుగుదలకు సంబంధించి రకరకాల ఉత్పత్తులు నేడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఫలితాల విషయానికి వస్తే మాత్రం శూన్యం అనే చెప్పవచ్చు. అందుకే చాలా మంది నేచురల్ ప్రొడక్ట్స్ వాడటానికి ఇష్టపడుతున్నారు.
జుట్టు సంబంధిత సమస్యలను తగ్గించడానికి శీకాకాయ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. విటమిన్ ఎ, సి, కె, విటమిన్ డిలు ఇందులో పుష్కంగా ఉంటాయి. అంతే కాకుండా శీకాకాయ్ లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.మరి జుట్టు రాలకుండా ఉండి జుట్టు బాగా పెరిగేందుకు శీకాకాయ్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లోనే శీకాకాయ్ షాంపూ పౌడర్ తయారు చేసుకోండిలా ..
కావలసినవి:
శీకాకాయ్ – 250 గ్రాములు
కుంకుడు కాయలు (గింజలు తీసి) – 100 గ్రాములు
మెంతి గింజలు – 100 గ్రాములు
ఎండు వేప ఆకులు – 1 పిడికెడు
పొడి ఉసిరి – 50 గ్రాములు
ఎండు కరివేపాకు – 1 పిడికెడు
పైన చెప్పిన పదార్థాలన్నింటిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకుని మిక్సీలోంచి తీసి జల్లించుకోవాలి. దీని తరువాత, ఈ పొడిని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి. మీ శీకాకాయ డ్రై షాంపూ సిద్ధంగా ఉంది.
ఉపయోగించడం ఎలా ?
శీకాకాయ్ షాంపూని ఉపయోగించాలంటే ముందుగా అందులో 4 స్పూన్ల పౌడర్ తీసుకుని నీళ్లలో వేసి కలపాలి. తర్వాత ఈ పేస్ట్‌ని మిక్స్ చేసి జుట్టుకు పట్టించి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత చల్లటి నీటితో వాష్ చేసుకోవాలి.
Also Read: వీటిని వాడితే.. జుట్టు పెరగడం పక్కా!
ఇలా కూడా ఉపయోగించవచ్చు..
శీకాకాయ్ షాంపూ యొక్క ప్రయోజనాలను రెట్టింపు చేయడానికి, ముందుగా దాని పొడిలో రైస్ వాటర్ మిక్స్ చేసి, ఆపై జుట్టుకు అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తర్వాత జుట్టును వాష్ చేయాలి. ఈ మిశ్రమానికి రోజ్ వాటర్ కూడా కలుపుకోవచ్చు. ఇది జుట్టు పెరుగుదలను మెరుగుపరచడమే కాకుండా చుండ్రును కూడా నివారిస్తుంది. జుటు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు దీనిని వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
ఇది జుట్టు పెరగడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. తరుచుగా దీనిని వాడటం వల్ల తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది. రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కెయిర్ ప్రొడక్టస్ వాడటానికి బదులుగా ఇలా నేచురల్ ప్రొడక్ట్స్ వాడటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి పెరిగేలా చేస్తాయి. జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వారానికి రెండు సార్లు దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.