Floor Cleaning Tips: ఇళ్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇళ్లలోని టైల్స్ ఎల్లప్పుడూ తెల్లగా మెరిసేలా ఉంచుకోవడం సవాల్ అనే చెప్పాలి. టైల్స్ క్లీనింగ్ కాస్త ఆలస్యం అయినా లేదా ఇంట్లో వాడుతున్న పదార్థాలు వాటిపై పడినా కొన్ని సార్లు ఎక్కువ మురికిగా మారుతుంటాయి. ఇదిలా ఉంటే మొండి మరకలు టైల్స్ అందాన్ని పాడుచేస్తాయి. ఇలాంటి సమయంలో కొన్ని రకాల టిప్స్ ఫాలో అవ్వడం వల్ల టైల్స్ మెరిసిపోతాయి.
మీ ఇంట్లోని టైల్స్ మెరుస్తూ ఉండడం వల్ల ఇల్లు అందంగా ఉండటమే కాకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని కూడా అందిస్తుంది. చాలా సార్లు, సరిగ్గా క్లీనింగ్ చేయకపోతే, నేలపై మొండి మరకలు ఏర్పడతాయి. ఇంట్లోని టైల్స్‌పై మొండి మరకలు ఉంటే వాటిని శుభ్రం చేయడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో ఈ మరకలను సులువుగా శుభ్రం చేసి నేలను మెరిసేలా చేయవచ్చు.
వెనిగర్, నిమ్మకాయ, బేకింగ్ సోడా మొదలైన కొన్ని పదార్థాలు దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో అందుబాటులోనే ఉంటాయి. ఇవి టైల్స్ ను మెరిసేలా చేయడంలో ఉపయోగపడతాయి. టైల్స్ శుభ్రం చేసే 5 పద్దతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టైల్స్ శుభ్రపరిచే పద్ధతులు:
వెనిగర్ ద్రావణం: ఒక బకెట్ నీటిలో ఒక కప్పు వెనిగర్ కలపండి. ఈ ద్రావణంతో ఎక్కడైతే టైల్స్ మురికిగా ఉన్నాయో అక్కడ బ్రష్ లేదా క్లాత్ సహాయంతో శుభ్రం చేయండి. వెనిగర్ ఫ్లోర్‌లను మెరిసేలా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా కాకుండా క్రిములను చంపుతుంది.
నిమ్మరసం: ఒక బకెట్ నీటిలో కొంచెం నిమ్మరసం పిండండి. ఈ ద్రావణంతో మురికి ఉన్న చోటును శుభ్రం చేయండి. మురికి ఎక్కువగా ఉండే ద్రావణాన్ని టైల్స్ పై రుద్ది 15 నిమిషాల పాటు వదిలేయండి. తర్వాత బ్రష్ సహాయంలో రుద్దండి. నిమ్మరసం నేలకు సహజమైన మెరుపును అందిస్తుంది.
బేకింగ్ సోడా: ఒక బౌల్‌లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో బేకింగ్ సోడా మిక్స్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను మరకలపై రాసి 5- 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ర్వాత శుభ్రమైన నీటితో వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల మురికి పూర్తిగా తొలగిపోతుంది. బేకింగ్ సోడా మొండి మరకలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుంది.
కొబ్బరి నూనె: చెక్కతో తయారు చేసిన వస్తువులపపై మురికి పోగొట్టడానికి కొబ్బరి నూనె చాలా బాగా పనిచేస్తుంది. కాస్త కొబ్బరి నూనె తీసుకుని అందులో మెత్తని క్లాత్ ముంచి నేలపై రుద్దండి. ఇది చెక్క టైల్స్ ను మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా వాటిపై ఉన్న మురికిని పూర్తిగా తొలగిస్తుంది.
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఫ్లోర్ క్లీనర్‌లు:
మీరు మార్కెట్లో లభించే వివిధ రకాల ఫ్లోర్ క్లీనర్‌లను కూడా ఇందుకు ఉపయోగించవచ్చు.
క్లీనర్‌ను కొనుగోలు చేసేటప్పుడు మీ నేల రకాన్ని ముందుగా గుర్తుంచుకోండి.
కొన్ని అదనపు చిట్కాలు
టైల్స్ శుభ్రపరిచే ముందుగా టైల్స్ పై ఉన్న దుమ్మును శుభ్రం చేయండి.
Also Read: చలికాలంలో తప్పకుండా తినాల్సినవి ఇవే !
తడి గుడ్డతో నేలను ఎప్పుడూ రుద్దకండి. ఇది మురికిని నేలంగా చేసి దెబ్బతీస్తుంది.
నేల పొడిగా ఉండటానికి కొంత సమయం ఇవ్వండి.
మీ టైల్స్ రకాన్ని బట్టి శుభ్రపరిచే పద్ధతిని ఎంచుకోండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.