IND vs AUS 1st Test: టీమ్ ఇండియా ( Team India ) వర్సెస్ ఆస్ట్రేలియా ( Australia ) మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో.. బుమ్రా సేన దారుణంగా విఫలమైంది. న్యూజిలాండ్ చేతిలో ఎలా ఆడిందో టీమ్ ఇండియా ( Team India ) ఇప్పుడు అలాగే ఆడుతోంది. ఆస్ట్రేలియా చేతిలో 150 పరుగులకే కుప్ప కూలింది టీమిండియా. అందరూ ఊహించినట్లుగానే మొదట బ్యాటింగ్ తీసుకున్న టీమిండియా ( Team India ) మొదటి.. నుంచి వికెట్లను పడేసుకుంది.
Also Read: IPL 2025 schedule: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ తేదీలు ఖరారు..ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే ?
Also Read: IND vs AUS BGT 2024: బ్యాటింగ్ ఎంచుకున్న బుమ్రా…ముగ్గురు కొత్త ప్లేయర్లతో బరిలోకి టీమిండియా?
ఈ తరుణంలోనే 49.4 ఓవర్లలో టీమిండియా ( Team India ) 150 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఎవరూ కూడా సరిగా రాణించలేదు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా చేతులెత్తేశారు. దీంతో ఆస్ట్రేలియా చేతిలో 150 పరుగులకే కుప్ప కూలింది టీమిండియా.
ఇక టీమిండియా.. బ్యాటింగ్ విషయానికి వస్తే… ఓపెనర్ యశస్వి జైస్వాల్ అలాగే పడికల్ ఇద్దరు కూడా డక్ ఔట్.. కావడం జరిగింది. 8 బంతిలాడిన జైశ్వాల్ డక్ ఔట్ కాగా 23 బంతులు ఆడి పడకల్ కూడా డక్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 74 బంతుల్లో మూడుసార్లు కొట్టి 26 పరుగులు చేశాడు. అయితే ఎంపైర్ తప్పిదంతో కేఎల్ రాహుల్ వెనుదిరిగాడు.
ఇప్పుడు కేఎల్ రాహుల్ ( KL Rahul ) వికెట్ వివాదంగా మారింది. అటు విరాట్ కోహ్లీ కూడా అద్భుతంగా రానిస్తాడు అనుకుంటే.. అందరికీ నిరాశ మిగిల్చాడు. 12 బంతులాడిన విరాట్ కోహ్లీ 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అటు వికెట్ కీపర్ రిషబ్ పంత్ 37 పరుగులతో రాణించాడు. అలాగే జూరేల్ 11 పరుగులు చేసి వెనిదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ కూడా నాలుగు పరుగులకే అవుట్ అయ్యాడు.
అయితే తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ( Nitish kumar reddy) 41 పరుగులతో శభాష్ అనిపించాడు. తన తొలి టెస్ట్ మ్యాచ్ లోనే 59 బంతులు వాడి 41 పరుగులు చేసి రాణించాడు. నితీష్ కుమార్ ( Nitish kumar reddy) తప్ప ఏ టీం ఇండియా ప్లేయర్ సరిగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అటు హర్షిత్ రానా ఏడు పరుగులు కెప్టెన్ బుమ్రా 8 పరుగులకు అవుట్ అయ్యారు.
Also Read: Virender Sehwag son: డబుల్ సెంచరీతో చెలరేగిన సెహ్వాగ్ కొడుకు
ఆస్ట్రేలియా బౌలర్లలో… మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. హాజల్ వుడ్ నాలుగు వికెట్లు పడగొట్టి రాణించాడు. కెప్టెన్ కమిన్స్ రెండు వికెట్లు పడ గొట్టి శభాష్ అనిపించాడు. మిచల్ మార్షల్ రెండు వికెట్లు తీశాడు.