Healthy Skin: చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, చర్మం పొడిబారుతుంది. అంతే కాకుండా నిస్తేజంగా కనిపిస్తుంది. ముఖ చర్మం మృదువుగా, మెరుస్తూ ఉండటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను తప్పకుండా పాటించాలి.
చలి, పొడి గాలి వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా మారడమే చర్మం గరుకుగా మారుతుంది. మీరు కూడా ఈ రకమైన సమస్యను ఎదుర్కుంటే గనక కొన్ని రకాల టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మరి చర్మం కాంతిని పెంచడానికి ఉపయోగపడే 5 ముఖ్యమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాగా మాయిశ్చరైజ్ చేయండి: మాయిశ్చరైజర్‌ని రోజుకు కనీసం రెండుసార్లు ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు రిచ్ మాయిశ్చరైజర్ వాడండి. హైలురోనిక్ యాసిడ్ , సిరమైడ్లతో కూడిన మాయిశ్చరైజర్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి.
వేడి నీటితో స్నానం చేయకూడదు: వేడి నీరు చర్మం నుండి తేమను తొలగిస్తుంది. అందుకే గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. సూర్యుని హానికరమైన కిరణాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఇంటి నుండి బయలుదేరే ముందు తప్పకుండా సన్‌స్క్రీన్‌ని వాడాలి.
హోం రెమెడీస్: తేనె, పెరుగు, కలబంద వంటి సహజమైన పదార్థాలు చర్మాన్ని మృదువుగా , మెరిసేలా చేస్తాయి. వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అంతే కాకుండా చర్మానికి లోపల నుంచి పోషణను అందిస్తుంది.
Also Read: హెన్నా ఇలా వాడారంటే.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారడం గ్యారంటీ
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: విటమిన్లు సి, ఇ, ఎ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తినండి. మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల కూడా చర్మానికి కూడా మేలు జరుగుతుంది.
ఒత్తిడిని తగ్గించండి: ఒత్తిడి చర్మంపై ప్రభావం చూపుతుంది. యోగా, మెడిటేషన్ లేదా మీకు నచ్చిన ఏదైనా యాక్టివిటీ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.