BigTV English

Liver Health: కాలేయాన్ని శుభ్రపరిచే డ్రింక్స్ ఇవే !

Liver Health: కాలేయాన్ని శుభ్రపరిచే డ్రింక్స్ ఇవే !

Tips For Liver Health: కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం. కాలేయం బలహీనంగా మారడం ప్రారంభిస్తే, శరీరంలో అనేక రకాల సమస్యలు ప్రారంభవుతాయి. జీర్ణక్రియ బలహీనంగా మారడంతో పాటు రక్తంలో మలినాలు కూడా పెరగడం ప్రారంభిస్తాయి. ఇదే కాకుండా, శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది.


ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలి అంటే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం అవసరం. ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కొన్ని హోం రెమెడీస్ కాలేయాన్ని శుభ్రపరచడంలో, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మీరు ఇంట్లోనే ఈ రెమెడీలను సులభంగా తయారు చేసుకోవచ్చు. అలాంటి 6 హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాలేయం కోసం హోం మేడ్ డ్రింక్స్..


నిమ్మకాయ నీరు:
నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కాలేయాన్ని శుభ్రపరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండుకుని తరుచుగా తాగాలి. మీరు దీనికి తేనెను కూడా యాడ్ చేసి తాడగవచ్చు. ఈ నిమ్మకాయ నీరు తరుచుగా తాగడం వల్ల కాలేయం శుభ్రం అవుతుంది.

గ్రీన్ టీ :
గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బీట్ రూట్ రసం :
బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు అధికంగా ఉంటాయి. ఇవి కాలేయాన్ని శుభ్రం చేయడంలో సహాయపడతాయి. మీరు బీట్ రూట్ రసంలో క్యారెట్, యాపిల్ లను కలిపి కూడా మిక్సీ పట్టుకోవచ్చు.

అల్లం, తేనె పానీయం:
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వేడి నీళ్లలో కాస్త అల్లం ముక్క, తేనె కలుపుకుని తాగాలి. ఇలా తాగడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

పసుపు పాలు:
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది కాలేయాన్ని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు వేడి పాలలో పసుపు కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా కాలేయం శుభ్రం అవుతుంది.

తులసి టీ:
తులసిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. తులసి ఆకులను మరిగించి టీ తయారు చేసి త్రాగాలి. ఈ టీ జలుబు , దగ్గు వంటి వాటికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.

Also Read: షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పకుండా తాగాల్సిన డ్రింక్ ఏంటో తెలుసా ?

హోం రెమెడీస్ వల్ల కలిగే ప్రయోజనాలు:

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. హోం రెమెడీస్ వల్ల కాలేయం బలంగా మారుతుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇవి, కాలేయంలోని రక్తాన్ని మంచి మార్గంలో శుభ్రపరచడంలో సహాయపడతాయి. బలహీనమైన రోగనిరోధక శక్తితో బాధపడుతున్న వ్యక్తులు వీటిని తీసుకోవడం రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Bed Bugs: బెడ్ మీద నల్లులు నిద్రలేకుండా చేస్తున్నాయా? ఇలా చేస్తే మళ్లీ రావు!

Unhealthy Gut: మీలో ఈ లక్షణాలున్నాయా ? గట్ హెల్త్ ప్రమాదంలో పడ్డట్లే !

Indian Sweets:15 నిమిషాల్లోనే రెడీ అయ్యే ఫేమస్ స్వీట్స్.. మరీ ఇంత సింపులా !

Guava Leaves For Health: జామ ఆకులు తింటే.. ఆశ్చర్యకర లాభాలు!

Silver Vark: స్వీట్స్‌పై సిల్వర్ వార్క్.. తింటే ఎంత డేంజరో తెలుసా ?

Mirror: ఈ రహస్యం తెలిస్తే అద్దం చూడడానికి కూడా భయపడతారు.. శాస్త్రం చెబుతున్న భయంకర నిజం..

Cancer Tests: క్యాన్సర్ గుర్తించడానికి.. ఏ టెస్టులు చేస్తారు ?

Lucky life partner: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీరు లక్కీ! ఎందుకంటే..

Big Stories

×