Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8లో రెండోవారం ఎలిమినేషన్ గురించి మర్చిపోయి కంటెస్టెంట్స్ అంతా కాసేపు ఫన్ గేమ్స్‌తో ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. అయితే శనివారం ప్రసారమయిన ఎపిసోడ్‌లో నైనికా, యష్మీలకు ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. వారిద్దరూ ఇకపై చీఫ్స్ స్థానంలో ఉండరని, తమకు కావాల్సిన చీఫ్‌ను తామే ఎంచుకోవాలని తెలిపారు. దీంతో హౌజ్‌లో చాలామంది కంటెస్టెంట్స్ సపోర్ట్‌తో అభయ్.. కొత్త చీఫ్ అయ్యాడు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌కు ఇద్దరే చీఫ్స్ ఉన్నారు. వారే అభయ్, నిఖిల్. ఇప్పుడు హౌజ్‌లో ఉన్న ఇతర కంటెస్టెంట్స్‌కు ఏ చీఫ్ టీమ్‌లో ఉండాలో నిర్ణయించుకునే సమయం వచ్చేసింది.
చీఫ్స్ మారారు
‘‘హౌజ్‌కు ఇద్దరు చీఫ్స్ ఫిక్స్ అయిపోయారు. ఏ టీమ్‌లో ఎవరు ఉంటారు అనేది ఈరోజు తేలాలి’’ అని నాగార్జున చెప్పడంతో సండే ప్రోమో మొదలయ్యింది. అభయ్ చీఫ్ అవ్వాలని ఓటు వేసిన సోనియా.. అనూహ్యంగా మళ్లీ నిఖిల్ టీమ్‌లోనే ఉండడానికి ముందుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. నాగ మణికంఠ.. నిఖిల్‌ను వద్దనుకొని అభయ్ టీమ్‌లో చేరాడు. నిఖిల్ టీమ్‌లో చేరాలని అనుకుంటున్నానని శేఖర్ భాషా ముందుకు రావడంతో పాటు దానికి తగిన కారణాలు కూడా చెప్పాడు. ‘‘అభయ్ ఎక్కువ మాట్లాడతాడు. నిఖిల్ ఎక్కువ వింటాడు’’ అన్నాడు. దానికి నాగార్జున.. ‘‘నువ్వు మాట్లాడుతూనే ఉంటే వినేవాళ్లు కావాలి’’ అని కౌంటర్ ఇచ్చారు.
Also Read: హౌజ్ నుండి అతడు ఎలిమినేట్.. ఫ్రెండ్స్ వెన్నుపోటుతో ఎలిమినేషన్స్‌లో ట్విస్ట్
నిఖిల్ కాదు నబీల్
విష్ణుప్రియా కూడా నిఖిల్ టీమ్‌లో ఉంటానని చెప్పింది. అసలు దానికి కారణమేంటి అని నాగార్జున అడగగా.. ‘‘నా గొయ్యి నేను తీసుకున్నాను’’ అని చెప్పింది విష్ణుప్రియా. దీంతో అందరూ నవ్వారు. నబీల్ వచ్చి అభయ్ టీమ్‌లోకి వెళ్దామనుకుంటున్నాను అని చెప్పాడు. అది విన్న అభయ్.. రా నబీల్ అనకుండా రా నిఖిల్ అన్నాడు. తను పేర్లు కన్‌ఫ్యూజ్ అవ్వడం చూసి అందరూ నవ్వుకున్నారు. అలా టీమ్స్ విభజన ముగిసిన తర్వాత ‘చిత్రం విచిత్రం’ అంటూ కంటెస్టెంట్స్‌తో ఫన్ టాస్క్ ఆడించారు నాగార్జున. అందులో కూడా శేఖర్ భాషా తన కుళ్లు జోకులతో తన టీమ్‌కు మైనస్ పాయింట్స్ తీసుకొచ్చాడు.
విష్ణుప్రియా జోకులు
‘చిత్రం విచిత్రం’ ఆటలో విష్ణుప్రియా, పృథ్వి కలిసి డ్యాన్స్ చేసి మరోసారి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. ఆటలో సీత కన్‌ఫ్యూజ్ అవుతున్నప్పుడు సోనియా తనకు జవాబు అందించింది. వెనక నుండి విష్ణుప్రియా సాయం చేసిందని నాగార్జున అనుకున్నారు. దానికి విష్ణుప్రియా లేచి ‘‘నాకు అంత బ్రెయిన్ ఉంటే ఐఏఎస్ అయ్యేదాన్ని’’ అని సమాధానమిచ్చింది. ఆ తర్వాత మణికంఠ – సీత, అభయ్, సోనియా కలిసి తమ డ్యాన్స్‌లతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. ముఖ్యంగా ఈ ఆటలో విష్ణుప్రియా వేసిన జోకులకు కంటెస్టెంట్స్‌తో పాటు నాగార్జున కూడా నవ్వుకున్నారు. ఎలిమినేషన్‌కు ముందు సండే చాలా ఫన్‌డేగా సాగిందని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది.