Guava Leaves For Hair: జామ ఆకులు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇవి మధుమేహం,జీర్ణ సమస్యలు , ఇన్ఫెక్షన్ల చికిత్సలో వాడుతుంటారు. జామ ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి.
ఈ ఆకులు జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు.. స్కాల్ప్ ను శుభ్రంగా, హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడతాయి. జామ ఆకులను ఉడికించిన నీరు జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇది జుట్టును సహజంగానే ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉడకబెట్టిన జామ ఆకుల నీరు జుట్టు సమస్యలను తొలగించడంలో సహాయపడే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. దీనిని జుట్టు ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టు కోసం:
జామ ఆకులను ఆయుర్వేదంలో చుండ్రు, దురద , జుట్టు రాలడం వంటి అనేక స్కాల్ప్ సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు . ఈ ఆకుల్లో ఉండే పోషకాల వల్ల సహజసిద్ధంగా జుట్టును ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. జామ ఆకుల్లో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కొల్లాజెన్ జుట్టు మూలాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టును మెరిసేలా ఉంచుతుంది.
ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి:
ఈ ఆకుల్లో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. నికరమైన మూలకాల నుండి జుట్టును ఇవి రక్షిస్తాయి. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.
మెరుగైన జుట్టు పెరుగుదలకు:
జుట్టు పెరుగుదలకు జామ ఆకు నీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నీరు జుట్టు మూలాలను బలపరుస్తుంది. అంతే కాకుండా పోషణను అందిస్తుంది. దీని కారణంగా జుట్టు వేగంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది .
స్కాల్ప్‌ను హైడ్రేట్‌గా ఉంచుతుంది:
జామ ఆకుల నీరు స్కాల్ప్‌ను హైడ్రేట్‌గా ఉంచుతుంది. దురద, చుండ్రు నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది తలకు తేమను అందిస్తుంది. అంతే కాకుండా జుట్టు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి:
ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది జుట్టును బలపరుస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలే సమస్యను నియంత్రిస్తుంది.
అనేక రకాల పోషకాలు:
విటమిన్-ఇ , విటమిన్-బి కాంప్లెక్స్‌లో పుష్కలంగా ఉండే జామ ఆకులను ఉడికించిన నీరు వెంట్రుకలను దృఢంగా మారుస్తుంది. తరుచుగా అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు మెరుస్తూ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఉండే అనాల్జేసిక్ లక్షణాలు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. జుట్టుకు తగిన పోషకాలను అందించి జుట్టు రాలకుండా చేస్తాయి. జామ ఆకుల నీటిని జుట్టుకు వాడటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇది జుట్టు సమస్యలను అన్నింటినీ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగిస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.