BigTV English

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Skin Care Tips: గ్లోయింగ్ స్కిన్ కోసం.. ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి

Skin Care Tips: వర్షాకాలంలో చాలా మంది చర్మం పొడిబారుతుంది. వాతావరణం చర్మాన్ని త్వరగా ప్రభావితం చేస్తుంది. వర్షాకాలంలో చర్మం డల్ గా, డ్రైగా మారడం సర్వసాధారణం. చాలా మంది చర్మ సంబంధిత సమస్యను ఈ సమయంలో ఎదుర్కొంటారు. ఇలాంటి సమయంలో ఇంట్లోనే తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీరు కూడా చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కుంటే గనక ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ లను తయారు చేసుకోవచ్చు. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయడంలో కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్‌లు ప్రభావవంతంగా పనిచేస్తాయి.


వర్షాకాలంలో తేమ, కాలుష్యం కారణంగా, చర్మం పొడిగా మారడమే కాకుండా నిర్జీవంగా మారుతుంది. అయితే కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. హోం మేడ్ ఫేస్ ప్యాక్ లు వీటిని తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ఫేస్ ప్యాక్ లు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఓట్స్ ,పెరుగు ఫేస్ ప్యాక్:


కావలసినవి:

ఓట్స్- 2 టేబుల్ స్పూన్స్

పెరుగు-  1 టేబుల్  స్పూన్

ముందుగా ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడానికి 2 చెంచాల ఓట్స్ ను గ్రైండ్ చేసి, పెరుగుతో కలపండి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఓట్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. పెరుగు చర్మానికి తేమను అందిస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ లు వాడటం వల్ల చర్మం అందంగా మారుతుంది.

2. అలోవెరా, హనీ ఫేస్ ప్యాక్:

కావలసినవి:
అలోవెరా జెల్- 2 టేబుల్ స్పూన్లు
తేనె – 1 టేబుల్ స్పూన్

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి పైన చెప్పిన మోతాదుల్లో అలోవెరా జెల్, తేనెను తీసుకుని ఒక బౌల్‌లో కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని వల్ల ముఖం అందంగా మారుతుంది. ఫేస్ కొత్త మెరుపును సంతరించుకుంటుంది.

3. అరటి, తేనె ఫేస్ ప్యాక్:

కావలసినవి:
అరటిపండు గుజ్జు-1 టేబుల్ స్పూన్
తేనె- 1/2 టేబుల్ స్పూన్

ముందుగా ఒక బౌల్‌లో పైన చెప్పిన మోతాదుల్లో అరటిపండు గుజ్జు, తేనెను తీసుకుని మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ఫేస్‌పై అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచండి. అనంరతం కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖం అందంగా మారుతుంది. తరుచుగా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల ఫేస్ గ్లో పెరుగుతుంది.

Also Read: వీటితో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం

4.టమోటా, నిమ్మకాయ ఫేస్ ప్యాక్:

కావలసినవి:
టమోటా గుజ్జు-1 టేబుల్ స్పూన్
నిమ్మ రసం- 1/2 టేబుల్ స్పూన్

ముందుగా పైన చెప్పిన మోతాదుల్లో టమోటా గుజ్జు, నిమ్మరసంలను ఒక బౌల్ లో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫేస్ పై అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం ద్వారా ఫేస్ పై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. టొమాటోలో ఉండే లైకోపీన్ చర్మాన్ని టోన్ చేస్తుంది. నిమ్మకాయ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×