BigTV English

Alzheimers: మీకు తెలుసా? నోటిలోని బ్యాక్టీరియాతో ఆ వ్యాధిని ముందే పసిగట్టేయొచ్చట !

Alzheimers: మీకు తెలుసా? నోటిలోని బ్యాక్టీరియాతో ఆ వ్యాధిని ముందే పసిగట్టేయొచ్చట !

Alzheimers: నోటి, నాలుకపై ఉండే బ్యాక్టీరియా మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా ఇది న్యూరోడీజెనరేటివ్ వ్యాధి ప్రమాదాన్ని కూడా సూచిస్తుందని ఓ అధ్యయనం పేర్కొంది. ఇదిలా ఉంటే అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచే బ్యాక్టీరియా కూడా నోటిలో ఉంటుంది. ఇవి మీ జ్ఞాపకశక్తి బలహీనపరుస్తాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా మీ జ్ఞాపకశక్తిని ఎలా బలహీనపరుస్తుందే విషయాలను గురించి బ్రిటన్ లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు వివరించారు.


ఈ పరిశోధన ఏం చెబుతోంది ?

నోటిలోని హానికరమైన బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోకి ప్రవేశించి మెదడుకు హాని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అదనంగా ఈ బ్యాక్టీరియా శరీరంలో మంచి , చెడు బ్యాక్టీరియా మధ్య సమతుల్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. అంతే కాకుండా మెదడు పనితీరును, జ్ఞాపకశక్తి ఏర్పడటానికి అవసరమైన నైట్రేట్‌ను నైటిక్ ఆక్సైడ్ గా మార్చడాన్ని తగ్గిస్తుంది.


ఇదిలా ఉంటే కొన్ని రకాల బ్యాక్టీరియా వయస్సు పెరగే కొద్దీ మెదడు ఆరోగ్యంపై ప్రతి కూల ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా దంత పరీక్షల సమయంలో బ్యాక్టీరియా స్థాయిలను కొలవడానికి , మెదడు ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు ప్రారంభ సంకేతాలను గుర్తించడానికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. 50 ఏళ్లు పైబడిన 110 మందిపై నిర్వహించిన పరిశోధనలో మౌత్ స్వాబ్ నమూనాలను విశ్లేషించి, వాటిలో కనిపించే బ్యాక్టీరియా వైవిధ్యాన్ని అధ్యయనం చేశారు.

ఎవరిలో ఎక్కువ ప్రమాదం ?

ప్రీవోటెల్లా అనే బ్యాక్టీరియా సమూహం తక్కువ నైట్రేట్ స్థాయిలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అల్జీమర్స్ వ్యాధి ప్రమాద జన్యువు APOE4 ను కలిగి ఉన్న వ్యక్తులలో ఈ బ్యాక్టీరియా అధిక మొత్తంలో కనుగొనబడింది. ఈ ఫలితాల ఆధారంగా “ఆహార మార్పులు, ప్రోబయోటిక్స్, నోటి పరిశుభ్రత దినచర్యలు లేదా లక్ష్య చికిత్సలు” వంటి చర్యలు అల్జీమర్స్ నివారించడంలో సహాయపడతాయి.

నీస్సేరియా, హేమోఫిలస్:
నోటిలో “నీస్సేరియా” , “హీమోఫిలస్” బాక్టీరియా సమూహాలు ఎక్కువగా ఉన్న వ్యక్తుల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సామర్థ్యం , సంక్లిష్టమైన పనులను చేయగల సామర్థ్యం మెరుగ్గా ఉంటాయి. ఈ వ్యక్తుల నోటిలో నైట్రేట్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు కూడా కనుగొనబడింది. “పోర్ఫిరోమోనాస్” బ్యాక్టీరియా అధిక స్థాయిలో ఉన్న వ్యక్తులకు జ్ఞాపకశక్తి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఆహారం తినడం మన నోటి నుండే ప్రారంభం అవుతుంది. నోటిలోని లాలాజలం ఆహారాన్ని మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా నోటిలో ఉండే ఎంజైములు కార్భోహైడ్రేట్లను జీర్ణం చేయడంలో సహాయపడతాయి. నోటిలో చెడు బ్యాక్టీరియా ఉంటే అవి ఆహారంతో పాటు కాలేయాన్ని కూడా పాడు చేస్తాయి. ఇది యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యను కలిగిస్తుంది.

Also Read: బ్లాక్ కాఫీ తాగుతున్నారా ? అయితే డెంజర్‌లో పడ్డట్లే !

నోటి ఆరోగ్యానికి మెదడుతో సంబంధం ఉంటుంది. దంతాలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు రక్తం కారుతుంది. దీని కారణంగా మన నోటిలో ఉండే బ్యాక్టీరియా రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఇలా మెదడు రక్తం ద్వారా వ్యాపించి కూడా మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. అందుకే నోటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×