Shamshabad News: హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న శంషాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. శంషాబాద్ లో అభంశుభం తెలియని 6 ఏళ్ల బాలికపై స్కూల్ బస్సు డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాఠశాల స్టూడెంట్స్ అందరూ పిక్నిక్ వెళ్లినట్లు సమాచారం. స్కూల్ పిక్నిక్ లో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. డ్రైవర్ పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడుని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Telangana BJP: తెలంగాణలో ఇప్పుడు బీజేపీ లక్ష్యం ఇదే.. పెద్ద ప్లానే వేసిందిగా..!!
కామంతో కళ్లు మూసుకుపోయిన కిరాతకుడికి కఠిన శిక్ష వేయాలని సోషల్ మీడియాలు పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు నిందితుడికి వెంటనే ఉరి శిక్ష వేస్తే.. మరో సారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావని కామెంట్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని పోలీసులకు, ప్రభుత్వానికి ప్రజలు వేడుకుంటున్నారు.