BigTV English
Advertisement

Carrot For Skin: మీ చర్మం తెల్లగా మెరిసిపోవాలా ? అయితే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Carrot For Skin: మీ చర్మం తెల్లగా మెరిసిపోవాలా ? అయితే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి

Carrot For Skin: చలికాలంలో చర్మం పొడిబారడంతోపాటు నిర్జీవంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే మీరు మీ చర్మానికి సహజమైన మెరుపు ,పోషణను అందించాలనుకుంటే, క్యారెట్‌తో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లు మీకు సహాయపడతాయి. క్యారెట్‌లో ఉండే విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు , మినరల్స్ చర్మాన్ని లోతుగా పోషించి, మృదువుగా ,మెరిసేలా చేస్తాయి. క్యారెట్‌తో 5 సులభమైన, ప్రభావ వంతమైన ఫేస్ ప్యాక్‌ల తయారీ ఉపయోగించే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


క్యారెట్‌తో ఫేస్ ప్యాక్:

క్యారెట్ పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పెరుగు – 2 టేబుల్ స్పూన్లు


మీ చర్మం నిర్జీవంగా, పొడిగా కనిపిస్తే, ఈ ఫేస్ ప్యాక్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఎలా తయారు చేయాలి:
1. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం ఒక బౌల్‌‌లో ఒక చెంచా క్యారెట్ రసం లేదా పేస్ట్, ఒక చెంచా పెరుగు కలపాలి.

2. పేస్ట్ తయారు చేసిన తర్వాత మీ ముఖం మీద అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.

ప్రయోజనం: ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా హైడ్రేట్ చేసి మృదువుగా చేస్తుంది.

2. క్యారెట్ , నిమ్మకాయ ఫేస్ ప్యాక్:
మీ చర్మం జిడ్డుగా ఉంటే, క్యారెట్ , నిమ్మకాయతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మీకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది.

ఎలా తయారు చేయాలి:
1. దీని కోసం, ముందుగా రెండు క్యారెట్లను ప్రెషర్ కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి.

2. ఆ తర్వాత అందులో ఒక చెంచా తేనె , సగం నిమ్మరసం కలపండి. దీన్ని 15-20 నిమిషాల పాటు ముఖానికి మృదువుగా మసాజ్ చేసి, ఆపై శుభ్రమైన నీటితో కడగాలి.

ప్రయోజనం: ఈ ప్యాక్ చర్మం నుండి అదనపు నూనెను తొలగించి, చర్మాన్ని తాజాగా మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా ముఖంపై ఉన్న మృత కణాలను కూడా తొలగిస్తుంది.

3. క్యారెట్ , దోసకాయతో ఫేస్ ప్యాక్:

మీరు మీ చర్మంపై మెరుపు , తాజాదనాన్ని కోరుకుంటే మాత్రం క్యారెట్ , దోసకాయ ఫేస్ ప్యాక్ మీకు ఉత్తమమైనది.

ఎలా తయారు చేయాలి:
1. 2-3 టేబుల్ స్పూన్ల క్యారెట్ రసంలో 1 టేబుల్ స్పూన్ దోసకాయ రసం , 1 టేబుల్ స్పూన్ క్రీమ్ వేసి ఒక బౌల్ లో కలపండి.
2. ఈ మిశ్రమాన్ని ముఖం ,మెడపై రాయండి. 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

ప్రయోజనం: ఈ ప్యాక్ చర్మానికి చల్లదనాన్ని, తేమను అందిస్తుంది. దీని వల్ల చర్మం తాజాగా అనిపిస్తుంది.

4. క్యారెట్ , గుడ్డు ఫేస్ ప్యాక్ :
క్యారెట్ , గుడ్డులో యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. నిర్జీవ చర్మానికి ఇది చాలా మేలు చేస్తుంది.

ఎలా తయారు చేయాలి:
1. 1 టేబుల్ స్పూన్ క్యారెట్ రసాన్ని 1 టేబుల్ స్పూన్ పెరుగు , గుడ్డులోని తెల్లసొనతో కలపండి.
2. దీన్ని ముఖం , మెడపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.

ప్రయోజనం: ఈ ప్యాక్ చర్మం బిగుతుగా , యవ్వనంగా కనిపించడంలో సహాయపడుతుంది.

Also Read: రాగి స్క్రబ్‌తో బోలెడు బెనిఫిట్స్

5. క్యారెట్ , శనగపిండి ఫేస్ ప్యాక్ :
క్యారెట్ , శనగ పిండి యొక్క ఫేస్ ప్యాక్ గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఎలా తయారు చేయాలి ?
1. దీని కోసం, ఒక చిన్న గిన్నె క్యారెట్ రసంలో 2 చెంచాల శనగపిండి, 1 చెంచా తేనె కలపండి.
2. ఈ పేస్ట్ ను ముఖం, మెడకు పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ప్రయోజనం: ఈ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా మృదువుగా చేస్తుంది.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×