ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకుల భద్రతకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు CISF అధికారులు తెలిపారు. ఢిల్లీ మెట్రోలో ప్రయాణీకులు సురక్షితంగా జర్నీ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రయాణీకులు పొరపాటున మెట్రో రైల్లో మర్చిపోయిన విలువైన వస్తువులను వారికి అందించినట్లు చెప్పారు. రూ. 40 లక్షలకు పైగా నగదు, 89 ల్యాప్ టాప్ లు, 193 మోబైల్స్, తొమ్మిది మంగళసూత్రాలతో పాటు పలు వస్తువులను అందించినట్లు తెలిపారు. దేశ రాజధాని ప్రాంతంలో 350 కి. మీ రైలు మార్గాన్ని కవర్ చేసే 250కి పైగా స్టేషన్లలో విస్తరించి ఉన్న ఢిల్లీ మెట్రో నెట్ వర్క్ కు ప్రొటెక్షన్ గా ఉన్నట్లు CISF తెలిపారు.
చెకింగ్ స్పాట్ లో వస్తువులను మర్చిపోయిన ప్రయాణీకులు
ఢిల్లీ మెట్రోలోని పలు రైల్వే స్టేషన్లలో ఎక్స్ రే బ్యాగేజ్ స్కానర్ దగ్గర ప్రయాణీకులు పలు వస్తువులను మర్చిపోయారు. అయితే, ఆయా వస్తువులను భద్రపర్చిన ఆయా ప్రయాణీకులకు అప్పగించారు CISF అధికారులు. అధికారిక డేటా ప్రకారం.. రూ. 40.74 లక్షల నగదు, 89 ల్యాప్ టాప్ లు, 40 వాచ్ లు, 193 మొబైల్ ఫోన్లతో పాటు, 13 జతల కళ్ల జోళ్లు, ఉంగరాలు, గాజులు వంటి ఇతర ఆభరణాలతో సహా వెండి ఆభరణాలను కూడా గుర్తించారు. గత ఏడాది CISF సిబ్బంది US డాలర్లు, సౌదీ రియాల్, థాయ్ బాట్ సహా మొత్తం రూ. 24,550 విలువ చేసే విదేశీ కరెన్సీని పట్టుకున్నారు.
ఏడాదిలో 23 మంది ఆత్మహత్య
2024 సంవత్సరం లో ఢిల్లీ మెట్రో నెట్ వర్క్ లో 59 ఆత్మహత్యాయత్నాలు జరిగినట్లు CISF భద్రతా సంస్థ వెల్లడించింది. వారిలో 23 మంది ప్రాణాలు కోల్పోగా, ముగ్గురిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. మరో 33 మంది గాయపడ్డారని తెలిపారు. అటు ప్రయాణీకులు, వారి సామాను తనిఖీలు చేస్తున్నప్పుడు మొత్తం 75 రౌండ్ల లైవ్ మందుగుండు సామగ్రితో పాటు 7 తుపాకీలను గుర్తించినట్లు CISF తెలిపింది. ఇక ఢిల్లీ మెట్రోలో ఒంటరిగా ప్రయాణిస్తున్న 262 మంది పిల్లలను గురించినట్లు అధికారులు తెలిపారు. వారిని తల్లిదండ్రులకు లేదంటే, స్థానిక పోలీసులు, చైల్డ్ హెల్ప్ లైన్ వాలంటీర్లకు అప్పగించినట్లు తెలిపారు. అటు ఆపదలో ఉన్న 671 మంది మహిళా ప్రయాణీకులకు కూడా సాయం అందించినట్లు వెల్లడించారు.
ఇక ఢిల్లీ మెట్రో నెట్ వర్క్ ను సురక్షితంగా ఉంచడానికి సుమారు 13 వేల మంది CISF సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. ఢిల్లీ, పరిసర నగరాలైన ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, ఘజియాబాద్, హర్యానాలోని గురు గ్రామ్, ఫరీదాబాద్ లో విస్తరించి ఉన్న ఢిల్లీ మెట్రో ద్వారా లక్షలాది మంది నిత్యం తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు.
ఇక ఢిల్లీ మెట్రో తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది. సీట్ల కోసం ప్రయాణీకులు కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలు చాలా సార్లు వైరల్ అయ్యాయి. పలువురు సోషల్ మీడియా ఇన్ ప్లూయెన్సర్లు సైతం ఢిల్లీ మెట్రోలో చేసిన రీల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ మధ్య ఓ జంట అసభ్యరీతిలో ఆ పనులు చేసిన వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది.
Read Also: ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెనపై వందేభారత్ పరుగులు..ఇండియన్ రైల్వేలో సరికొత్త అధ్యాయం!