Minister Sridhar Babu: హైదరాబాద్ ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం రూ.15 వేల కోట్లతో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. గురువారం నాడు గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రసంగించారు.
మెట్రో రైలు విస్తరణ, రీజనల్ రింగురోడ్డు, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, విద్యుత్తు వాహనాల ఉత్పత్తి కేంద్రంగా, క్వాంటమ్ ఇంజనీరింగ్, బయో ఇన్ఫర్మేటిక్స్ రంగాలతో పాటు మూసీ పునరుజ్జీవన పథకం ద్వారా ఈ నగరం సుస్థిరాభివృద్ధికి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళ్తోందని శ్రీధర్ బాబు చెప్పారు. మైక్రోసాఫ్ట్ సంస్థతో హైదరాబాద్ అనుబంధం మూడు దశాబ్దాల నాటిదని, తాజాగా 11 లక్షల చదరపు అడుగుల విస్ణీర్ణంలో నూతన భవనం నిర్మించడం ద్వారా తన అంకితభావాన్ని చాటుకుందని ఆయన ప్రశంసించారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో భారీ ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తోందని ఆయన తెలిపారు. దేశంలోనే హైదరాబాద్ ను అతిపెద్ద డేటా సెంటర్ల హబ్ గా మారుస్తోందని మంత్రి శ్రీధర్ బాబ కొనియాడారు.
ఏఐ సిటీలో తమ కృత్రిమ మేధ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించడం తమ ప్రభుత్వ విశ్వసనీయతకు నిదర్శనమని మంత్రి చెప్పారు. సాంకేతిక దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ (Adobe) సీఈఓ శాంతను నారాయణ్ లను ప్రపంచ టెక్నాలజీకి అందించిన ఘనత ఈ నగరానిదే అని చెప్పుకొచ్చారు. నూతన ఆవిష్కరణలకు మూలస్థంభంగా హైదరాబాద్ మహా నగరం స్థానం సంపాదించుకుంది. ప్రపంచంలోని ప్రతి మూలన జరుగే సాంకేతిక విప్లవానికి భాగ్య నగరం ఏదో రకంగా భాగస్వామిగా ఉంటోందని అన్నారు.
ఇక్కడితో తమ ప్రభుత్వం సంతృప్తి చెందడం లేదని పేర్కొన్నారు. ఇది ఒక ఆరంభం మాత్రమే కాదని.. సుధీర్థ ప్రస్థానానికి రహదారులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. 52 ప్రపంచస్థాయి పరిశోధన కేంద్రాలు, 30కి మించిన విశ్వవిద్వాలయాలు, 6 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సులు, 60 లక్షల మంది ఉత్సాహం ఉరకలెత్తే శ్రామికశక్తితో హైదరాబాద్ అభివృద్ధి లో పరుగులు తీస్తుందని తెలిపారు. 90 లక్షల ఇళ్లను డిజిటల్ కనెక్టివిటిలోకి తీసుకొస్తున్నాస్తున్నాం అని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.