BigTV English
Advertisement

Chicken Popcorn: పిల్లలకి చికెన్ పాప్‌కార్న్ ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు

Chicken Popcorn: పిల్లలకి చికెన్ పాప్‌కార్న్ ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు

Chicken Popcorn: చికెన్ పాప్‌కార్న్ అంటే పెద్దలకే కాదు, పిల్లలకు కూడా ఇష్టమే. ఇది క్రిస్పీగా ఉంటుంది. దీన్ని కొన్ని తినాలంటే ఎక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇంట్లోనే చేసుకుంటే చికెన్ పాప్‌కార్న్ తక్కువ ఖర్చులోనే రెడీ అయిపోతుంది. పైగా ఎంత కావాలంటే అంత తినొచ్చు. ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఇది ఆరోగ్యకరమైనదిగా కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి చికెన్ పాప్‌కార్న్ ఎలా చేయాలో తెలుసుకోండి.


చికెన్ పాప్‌కార్న్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చికెన్ ముక్కలు – అరకిలో
బ్రెడ్ ముక్కలు – నాలుగు
మైదా – పావు కప్పు
కారం – ఒక స్పూను
కార్న్ ఫ్లోర్ – రెండు స్పూన్లు
నిమ్మరసం – ఒకటిన్నర స్పూను
చిల్లీ ఫ్లెక్స్ – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాల పొడి – అర స్పూను
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
మిరియాల పొడి – అర స్పూను

చికెన్ పాప్‌కార్న్ రెసిపీ
⦿ బోన్ లెస్ చికెన్ ఇంటికి తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
⦿ ఒక గిన్నెలో మిరియాల పొడి, ఉప్పు, చిల్లి ఫ్లెక్స్ , నిమ్మరసం, సోయా సాస్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి.
⦿ అందులోనే చికెన్ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి.
⦿ చివర్లో ఒక గుడ్డును కొట్టి అందులో వేసి బాగా కలిపి మ్యారినేట్ చేయాలి.
⦿ మ్యారినేట్ చేసే సమయంలో సాధారణ ఫ్రిజ్లో దీన్ని పెట్టాలి.
⦿ ఇప్పుడు ఒక ప్లేట్లో బ్రెడ్ ముక్కలను మిక్సీలో పొడి చేసి వేసుకోవాలి.
⦿ అందులోనే మైదా పిండిని ఒక స్పూను కారం, అర స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి.
⦿ దీన్ని ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెని వేయాలి.
⦿ ఫ్రిజ్‌లోంచి చికెన్ ముక్కలను తీసి ఈ బ్రెడ్ పొడి మిశ్రమంలో ఇటూ అటూ దొర్లించాలి.
⦿ తర్వాత వాటిని తీసి వేడెక్కిన నూనెలో వేసి వేయించాలి.11. వీటి రంగు మారేవరకు వేయించుకోవాలి.
⦿ తర్వాత తీసి టిష్యూ పేపర్ మీద వేయాలి.
⦿ ఇది అదనపు నూనెను పీల్చేస్తుంది.
⦿ అంటే చికెన్ పాప్ కార్న్ రెడీ అయినట్టే. ఇవి క్రిస్పీగా ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు.


Also Read:  బియ్యంలో పురుగులు పడుతున్నాయా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్

బయట దొరికే చికెన్ పిజ్జాలు, బర్గర్ల కన్నా ఇలా ఇంట్లోనే చికెన్ పాప్ కార్న్ వండి పిల్లలకు పెట్టడం మంచిది. ఇది మీ చేత్తో చేసి పెట్టిందే కనుక అన్ని రకాలుగా శుభ్రంగానే ఉంటుంది. పిల్లల ఆరోగ్యం కూడా పాడవకుండా ఉంటుంది. చికెన్ పాప్ కార్న్ ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది. టమోటా కెచప్ తో వీటిని తింటే చాలా రుచిగా ఉంటాయి. చికెన్ చేసే వంటకాలు ఏవైనా టేస్టీగా ఉంటాయి. ఈ చికెన్ పాప్ కార్న్ మీకు కచ్చితంగా నచ్చే అవకాశం ఉంది. కాకపోతే వీటిని డీప్ ఫ్రై చేస్తాము కాబట్టి, వీటిని తరచూ కాకుండా నెలకోసారి తింటే ఎలాంటి సమస్యా ఉండదు.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×