BigTV English

ChikkuduKaya Pachadi: చిక్కుడుకాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే నోరూరిపోయేంత టేస్ట్!

ChikkuduKaya Pachadi: చిక్కుడుకాయ నిల్వ పచ్చడి.. ఇలా చేస్తే నోరూరిపోయేంత టేస్ట్!

చిక్కుడుకాయ కూర, చిక్కుడుకాయ వేపుడు తిని ఉంటారు. ఒకసారి చిక్కుడుకాయ నిల్వ పచ్చడి ప్రయత్నించండి. దీన్ని ఒక్కసారి చేసుకుంటే నెల అంతా తినవచ్చు. నిల్వ పచ్చళ్ళు ఎన్నో రకాలు ఉన్నాయి. చికెన్, మటన్, చేప, పుదీనా, కొత్తిమీర ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల నిల్వ పచ్చళ్ళు మనము చేస్తాము. ఇప్పుడు వాటి జాబితాలో చిక్కుడుకాయ కూడా చేరిపోయింది. చిక్కుడుకాయతో చేసిన నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నిలవ పచ్చళ్ళు నచ్చితే ఒకసారి ఈ పచ్చడిని కూడా ప్రయత్నించి చూడండి.


చిక్కుడుకాయ నిల్వ పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
చిక్కుడు కాయలు – అరకిలో
మెంతులు – ఒక స్పూను
ఆవాలు – మూడు స్పూన్లు
జీలకర్ర – ఒక స్పూను
ఎండుమిర్చి – ఆరు
చింతపండు – పెద్ద నిమ్మకాయ సైజులో
నూనె – సరిపడినంత
వెల్లుల్లి రెబ్బలు – ఇరవై
కారం – నాలుగు స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – ఒక స్పూను

చిక్కుడుకాయ నిల్వ పచ్చడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి ఆవాలు, మెంతులు వేసి వేయించాలి.
2. తర్వాత వాటిని మెత్తని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి.
3. చిక్కుడుకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తడి తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి.
4. ఏ చిక్కుడుకాయలను తీసుకోవాలని ఆలోచిస్తున్నారా లోపల పెద్ద పెద్ద గింజలు ఉంటే చిక్కుడుకాయలను తీసుకుంటే మంచిది.
5. ఈ చిక్కుడుకాయలకు రెండు వైపులా నారను తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో వేసుకోండి.
6. ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండును వేసి, ఒక కప్పు మరిగించిన నీళ్లను పోసి నానబెట్టండి.
7. స్టవ్ మీద కళాయి పెట్టి ఒక కప్పు నూనె పోయండి.
8. ఆ నూనె వేడెక్కాక ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసి వేయించుకోండి. వాటిలో తేమ పోయాక ఒక గిన్నెలో తీసి పెట్టుకోండి.
9. ఇప్పుడు అదే కళాయిలో ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు, ఆరు ఎండుమిర్చి, గుప్పెడు కరివేపాకులు వేసి వేయించండి.
10. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేయించండి. చివర్లో ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయండి.
11. ఈ తాలింపులో ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసి కలపండి. అయితే తాలింపు పూర్తిగా చల్లారాకే వీటిని కలపాలి.
12. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కళాయి పెట్టి మూడు స్పూన్ల నూనె వేయండి.
13. అందులో ముందుగా నానబెట్టిన చింతపండును చేత్తోనే గుజ్జులా చేసుకొని అందులో వేసి వేయించండి.
14. చింతపండు గుజ్జు నూనెలో వేయించి దగ్గరగా వస్తుంది. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయండి.
15. ఇప్పుడు చిక్కుడుకాయల మిశ్రమంలో మూడు స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ పసుపు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి వేసి బాగా కలపండి.
16. అలాగే చింతపండు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఒక జాడీలో వేయండి.
17. రెండు రోజులు పాటు దానిని ముట్టుకోకుండా అలా వదిలేయండి. తర్వాత తీసి చూస్తే అదిరిపోయే టేస్టీ చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే.


Also Read: మిగిలిపోయిన అన్నంతో పల్లీల రైస్.. ఇలా చేసేయండి

ఇంకెందుకు ఆలస్యం వేడివేడి అన్నంలో ఈ చిక్కుడుకాయ పచ్చడి కలుపుకొని తిని చూడండి. మీ ఇంటిల్లిపాదికి నచ్చడం ఖాయం. మీరు మొదటిసారి చిక్కుడుకాయ పచ్చడి చేస్తున్న వారైతే ఒక పావు కిలో చిక్కుళ్లతోనే దీన్ని ప్రయత్నించండి. అనుభవం వచ్చాక ఎక్కువ నిల్వ పచ్చడి చేసుకోవచ్చు.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×