Big Stories

Donkey Milk: పిల్లలకు గాడిద పాలు తాగిస్తున్నారా.. లేదా ? ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Donkey Milk: చిన్నప్పుడు పుట్టిన పిల్లలకు ఆహారం ఏంటి అంటే పాలు అని చెబుతారు. పాలకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. కేవలం చిన్న పిల్లలే కాదు, పెద్దవారి వరకు వరకు పాలు లేకుండా వారి రోజు గడవదు. తరచూ పాలు, టీ, కాఫీలు తాగడం అనేది అందరికీ అలవాటే మరి. అయితే ఆవు, గేదె, మేక పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది అని అంటారు. కానీ వీటితో పాటు గాడిద పాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉందని మీకు తెలుసా. జీవితంలో ఒక్కసారి అయినా గాడిద పాలు తాగాలని పెద్దలు చెబుతుంటారు. అసలు ఎందుకు తాగాలి. దాని వల్ల లాభం ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

మొదటి నుండే గాడిద పాలకు మాములూగా డిమాండ్ లేదు. ఆవు పాలు, గేదె పాలు కంటే గాడిద పాలకు భారీ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే గాడిద కేవలం నాలుగు కప్పుల పాలు మాత్రమే ఇస్తుంది. అందువల్ల వీటికి అధిక ధర ఉంటుంది. అయితే మేక, ఆవు, గేదె వంటి వాటితో పోలిస్తే గాడిద పాలలో తల్లి పాలలో ఉండే పోషకాలు ఉంటాయని ఓ పరిశోధనలో తేలింది.

- Advertisement -

పిల్లలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా పూర్వకాలంలో గాడిద పాలనే తాగించేవారట. ఎందుకంటే గాడిద పాలలో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలను తాగడం వల్ల ఇన్ఫెక్షన్లు, దగ్గు, జ్వరం, ఆస్తమా, గాయాలు వంటి వాటి నుంచి గాడిద పాలు ఉపశమనం ఇస్తాయి. అంతేకాదు ఎసిడిటీ, నిద్రలేమి వంటి వాటికి కూడా గాడిద పాలు అద్భుతంగా పనిచేస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News