Coffee Powder For Skin: అందమైన , మెరిసే చర్మం కలిగి ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ముఖ్యంగా చలికాలం విషయానికి వస్తే, ఈ రోజుల్లో మనం ఎక్కువగా చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ శీతాకాలంలో, మన చర్మం సహజమైన మెరుపును కోల్పోతుంది. అంతే కాకుండా చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది. మన చర్మాన్ని మెరిసేలా, అందంగా ఉంచుకోవడానికి అనేక రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.
చలికాలంలో కూడా మీ ముఖం యొక్క రంగును పెంచుకోవడంతో పాటు , అందంగా కనిపించడం కోసం హోం రెమెడీస్ ఉపయోగించవచ్చు. హోం రెమెడీస్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇదిలా ఉంటే కాఫీ పౌడర్ తో తయారు చేసిన హోం రెమెడీస్ చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతే కాకుండా ముఖంపై మచ్చలు లేకుండా చూస్తాయి. మరి కాఫీ పౌడర్ ను గ్లోయింగ్ స్కిన్ కోసం ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ పౌడర్ సహాయంతో చర్మాన్ని శుభ్రం చేసుకోండి:
మీరు మీ ముఖాన్ని అందంగా, మెరిసేలా చేయాలనుకుంటే ముందుగా మీరు మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. మెరిసే చర్మాన్ని పొందడానికి ఇది మొదటి మెట్టు. ముఖం అందంగా ఉండాలంటే రెండు చెంచాల పాలలో ఒక చెంచా కాఫీ పొడి కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను కాటన్ బాల్ సహాయంతో మీ ముఖంపై అప్లై చేయండి. సుమారు 5 నిమిషాల పాటు వృత్తాకారంలో రుద్దిన తర్వాత, మీ ముఖాన్ని సాధారణ నీటితో వాష్ చేయండి.
కాఫీతో స్క్రబ్ చేయండి:
మీరు మీ ముఖాన్ని స్క్రబ్ చేయాలనుకుంటే.. మీరు దీనికి కూడా కాఫీ పొడిని ఉపయోగించవచ్చు. కాఫీ పొడిని స్క్రబ్‌గా ఉపయోగించాలంటే, ఒక చెంచా కాఫీ పౌడర్‌లో ఒక చెంచా బ్రౌన్ షుగర్, తేనె కలపాలి. తర్వాత మీరు ఈ పేస్ట్‌ను చేతులతో మొత్తం ముఖంపై అప్లై చేసి మసాజ్ చేయాలి.
కాఫీ పౌడర్ తో మాస్క్:
కాఫీ ఫేస్ మాస్క్ మీ ముఖ ఛాయను మెరుగుపరచడంలో మీకు చాలా సహాయపడుతుంది. ఈ ఫేస్ మాస్క్‌ను తయారు చేయడం సులభం. ఇందుకోసం ముందుగా ఒక చెంచా కాఫీ పొడిని ఒక చెంచా బియ్యప్పిండి , ఒక చెంచా తేనె కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను మీ ముఖంపై అప్లై చేసి 15 నుండి 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో బాగా వాష్ చేయండి. ఇది మీ ముఖానికి కొత్త మెరుపును అందిస్తుంది.
Also Read: ఇలా చేస్తే.. జుట్టు రాలమన్నా రాలదు
ముఖంపై మసాజ్:
ఈ ఫేషియల్ మసాజ్ మీ ముఖంలో కోల్పోయిన మెరుపును తిరిగి తీసుకురావడంలో మీకు చాలా సహాయపడుతుంది. దీని కోసం మీరు ఒక చెంచా అలోవెరా జెల్‌లో ఒక చెంచా కాఫీ పొడిని కలపాలి. దీని తర్వాత మీరు ఒక చెంచా కొబ్బరి నూనెను జోడించి పేస్ట్ సిద్ధం చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై 5 నుండి 10 నిమిషాల పాటు మసాజ్ చేస్తూ ఉండండి.