BigTV English

Non Stick Pan: నాన్​ స్టిక్​ పాత్రల్లో ఇవి అస్సలు వండకూడదు..?

Non Stick Pan: నాన్​ స్టిక్​ పాత్రల్లో ఇవి అస్సలు వండకూడదు..?

Non Stick Pan: ప్రస్తుతం ఏ వంటింట్లో చూసినా నాన్ స్టిక్ పాత్రలు దర్శనమిస్తున్నాయి. మార్కెట్లో కొత్తగా కనిపిస్తే చాలు దానిని కొనేసి వాడేస్తుంటారు. ఇప్పటికే చాలా రకాల పాత్రలు వచ్చినా నాన్ స్టిక్ పాత్రల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఎందుకంటే నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేస్తే మరకలు లేకుండా, చూడడానికి స్టైలిష్ గా, జిడ్డు అతుక్కోకుండా ఉంటుందని చాలా మంది వీటిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీటిని కొనడం వరకు సరే కానీ.. ఇందులో అన్ని వంటలు చేయడం మాత్రం అంతమంచిది కాదట. ఏది పడిదే దానిని నాన్ స్టిక్ పాత్రల్లో వండుకుని తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి అసలు ఏవి వండుకోవాలి, ఏవి వండుకోకూడదో తెలుసుకుందాం.


నాన్ స్టిక్ పాత్రలను టెప్లాన్ కోటింగ్ తో తయారుచేస్తారు. దీనికి ఎటువంటి మరకలు అంటుకోవు. ఒకవేళ అంటుకున్నా త్వరగానే తొలగిపోతాయి. అయితే నాన్ స్టిక్ పాత్రలపై ఉండే టెప్లాన్ కోటింగ్ అనేది వాడుతూ ఉండగా కరిగిపోతుందట. అందువల్ల కొన్ని రకాల వంటకాలను ఈ పాత్రల్లో చేయడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంతో వండే వంటలను నాన్ స్టిక్ పాత్రల్లో అస్సలు వండకూడదు. పులుపుకు సంబంధించిన ఆహార పదార్థాలు ఏవి అయినా సరే నాన్ స్టిక్ పాత్రల్లో వండకూడదని అంటున్నారు.

Don't Cook this food in Non Stick Pan
Don’t Cook this food in Non Stick Pan

వంట చేసే సమయంలోను పాత్రను స్టవ్‌పై పెట్టిన వెంటనే అందులో నూనె వేయాలట. నాన్ స్టిక్ పాత్రలను మంట మీద ఖాళీగా పెట్టకూడదట. నాన్ స్టిక్ పాత్రల్లో స్టీల్ గరిటెలు కాకుండా చెక్క గరిటెలను ఉపయోగించాలి. అందువల్ల నాన్ స్టిక్ పాన్ లపై కోటింగ్ పోకుండా ఉంటుంది. అంతేకాకుండా నాన్ స్టిక్ పాత్రలకు సబ్బులను అధికంగా ఉపయోగించకూడదు. గరుకుడా ఉండే పీచులు, సబ్బులను ఉపయోగించడం వల్ల నాన్ స్టిక్ పాత్రలోని కోటింగ్ తొలగింపోతుంది. అందువల్ల సాధారణంగా ఉండే పీచు ముక్కలతో శుభ్రం చేయాలి.


Tags

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×