BigTV English

Husband Wife Problems: నా భార్యకు అలాంటి బుద్ధి ఉంటుందని అనుకోలేదు.. నా సహోద్యోగులతో అలా చేస్తోంది

Husband Wife Problems: నా భార్యకు అలాంటి బుద్ధి ఉంటుందని అనుకోలేదు.. నా సహోద్యోగులతో అలా చేస్తోంది

ఒక్కో మనిషికి ఒక్కో వ్యక్తిత్వం, ఒక్కో లక్షణం ఉంటుంది. అలా ఒక వ్యక్తి తన భార్యతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. తన భార్యలో ఉన్న ఒక గుణం వల్ల అతను ఎన్నో కష్టాల పాలవుతున్నాడు. దానికి మానసిక వైద్యులు ఎన్ని ఎలాంటి పరిష్కారం చెప్పారో చూడండి.


ప్రశ్న: మాది పెద్దల కుదిర్చిన వివాహమే. నా భార్య అన్ని విషయాలలో చక్కగానే ఉంటుంది. నాకు తోడ్పాటును అందిస్తుంది. పిల్లలను కూడా బాధ్యతగా చూసుకుంటుంది. పిల్లలతో సమానంగానే నన్ను కూడా చూసుకుంటుంది. కానీ ఆమెలో ఉన్న ఒక లక్షణం వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అది అసూయ. ఆమెకు నాతో పాటు పనిచేసే మహిళా ఉద్యోగులు అంటే చాలా అసూయ. వారు మా ఇంటికి వచ్చినా, ఫోన్ చేసినా, మెసేజులు పెట్టినా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది. వారి ముందు నా పరువు తీసేస్తుంది. వారు నాతో స్నేహపూర్వకంగా ఉండడం భరించలేకపోతోంది. వారు అందంగా తయారవడం, ఫ్యాషనబుల్‌గా ఉండడం కూడా ఆమె భరించలేకపోతోంది.

నా భార్య చూసేందుకు చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. కానీ నా సహోద్యోగులు మాత్రం ఈ తరం అమ్మాయిలు కావడంతో వారు పాశ్చత్య డ్రెస్సింగ్ లో కనిపిస్తారు. ఆమె వారిని చూస్తేనే మండిపడుతోంది. ఇంటికి వస్తే కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదు. దాంతో వారిని ఇంటికి ఆహ్వానించడమే మానేశాను. ఏదో పనిమీద నాకు ఫోన్ చేస్తే వారితో దురుసుగా మాట్లాడి పెట్టేస్తోంది. దీంతో వృత్తిపరంగా కూడా నాకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అలాగే వారు మెసేజులు పెట్టినా కూడా అవి ప్రతిసారి చెక్ చేసి ఏదో ఒక విషయంలో నాతో గొడవ పడుతోంది. నిజానికి నా మహిళా సహద్యోగులతో నాకు స్నేహం మాత్రమే ఉంది. వారు కూడా పద్ధతిగా ఉండే మనుషులే. కానీ నా భార్య ఎందుకంత అభద్రతగా ఉంటుందో తెలియడం లేదు. ఆమెతో ఈ టాపిక్ మాట్లాడాలంటే భయమేస్తోంది. నేను నా మహిళా సహద్యోగుల మెసేజులను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాను. నా భార్యను ఎలా మార్చుకోవాలో చెప్పండి.


జవాబు: మీ భార్యది అసూయ కాదు… అభద్రత. ఇప్పుడు అందరూ ఫ్యాషన్‌బుల్‌గా పాశ్చత్య సంస్కృతి అలవాట్లనే అలవర్చుకుంటున్నారు. ఆమె ఇంకా చీర కట్టులోనే పద్ధతిగా ఉంతోంది. మీరు ఎక్కడ ఆ వెస్ట్రన్ వేర్ వేసుకున్న అమ్మాయిలకి ఆకర్షితులు అవుతారేమోనని ఆమె భయపడుతూ ఉండవచ్చు. దానికే మీ భార్య ఇలా ప్రవర్తిస్తోందని మా భావన. మీరు ఆమెతో ఎంత ఓపెన్ గా, నిజాయితీగా మాట్లాడతారో ఈ సమస్య కూడా అంతే త్వరగా పోతుంది. దేనికైనా కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఆమె తిడుతుందని, కోప్పడుతుందని కమ్యూనికేషన్ లేకుండా దూరంగా జరిగితే అది ఇంకా సమస్యలకు కారణం అవుతుంది.

ఆమె మీ సహోద్యోగుల గురించి ఏమనుకుంటుందో మొదట కూర్చుని మాట్లాడండి. ఆమె చేత మీరు ఎంతగా మాట్లాడితే ఆ మనసులోని బాధ అంతగా బయటికి వస్తుంది. ఆమె తిడుతోందని, అరుస్తోందని మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి మీరు ఆమె తిట్టినా, కొట్టినా ఓపికగా కూర్చుని ఆమె మనసులోని బాధను వినండి. అది విన్నాక మీరు ఆమెకు భరోసా ఇవ్వాలి. ఆమె మానసిక ఆందోళన తగ్గించడానికి ప్రయత్నించండి. మీ మహిళా సహోద్యోగులంతా మీకు కేవలం పని వరకేనని చెప్పండి. మీ భార్యే మీ జీవితమని ఆమెకు అర్థం అయ్యేలా చెప్పండి. అలాగే మీ మహిళా సహద్యోగులకు కూడా వివరించి మీ భార్యతో ఉన్న పరిచయాన్ని పెంచండి. మీరు ఎంత పారదర్శకంగా ఉంటే మీ భార్య కూడా అంతే ఆందోళన లేకుండా జీవించగలదు.

Also Read: మా మామగారు అలాంటి పనులు చేస్తున్నారు.. మా అత్త, భర్తకు ఆ విషయం చెప్పేది ఎలా?

మీ సహోద్యోగులుతో మీకు స్పష్టమైన సరిహద్దులు ఉన్నాయని ఆమెకు అర్థమయ్యేలా చెప్పండి. వారితో ఫోన్లో కానీ, మీ భార్య ముందే సరదాగా మాట్లాడడం, సరసాలు ఆడినట్టు మాట్లాడడం చేయవద్దు. ఇది మీ భార్యకు నచ్చకపోవచ్చు. మీ బంధాన్ని బలోపేతం చేయడానికి మీ జీవితంలో ఆమె ప్రాధాన్యత ఏంటో చెప్పండి. అలాగే మీ ఫోన్ పాస్‌వర్డ్ మార్చడం వంటివి చేయవద్దు. మీ భార్యనే మీ ఫోన్ పాస్‌వర్డ్‌ను పెట్టమనండి. ఆమె జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, వారు కేవలం ఉద్యోగ పరమైన స్నేహితులేనని వివరించండి. అసూయ, అభద్రత ఇలాగే కొనసాగితే ఓసారి మానసిక వైద్య నిపుణులతో కూడా మాట్లాడి ఆమెకి కౌన్సిలింగ్ ఇప్పించండి. లేకుంటే మీ సమస్య ఇంకా పెరిగి ఇబ్బందుల పాలవుతారు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×