Double Chin: చెడు జీవనశైలి ప్రభావం శరీరంపైనే కాదు మీ ముఖంపై కూడా కనిపిస్తుంది. దీని కారణంగా, ముఖంపై కొవ్వు పెరగడం ప్రారంభమవుతుంది. ఇది మీ రూపాన్ని ,ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా డబుల్ చిన్ రావడం కొన్ని ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది. బరువు పెరగడం, అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు తినడం, వృద్ధాప్యానికి సంకేతాలుగా కూడా డబుల్ చిన్ వస్తుంది.
ఈ సమస్యతో ఇబ్బంది పడే వారు ముఖంపై కొవ్వు తగ్గించుకోవడం వల్ల అందంగా కనిపించడమే కాకుండా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అందుకే డబుల్ చిన్‌ను వదిలించుకోవడానికి మీ జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పకుండా చేసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం తినడం, రోజూ వ్యాయామం చేయడం, హైడ్రేషన్ విషయంలో జాగ్రత్త వహించడం వంటివి చేయాలి. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
డబుల్ చిన్ తగ్గించుకోవడానికి తప్పకుండా చేయాల్సినవి ఇవే :
ఫిష్ ఫేస్ ఎక్సర్‌సైజ్- ఈ ఎక్సర్‌సైజ్ చేయడానికి, మీ పెదవులు, బుగ్గలను లోపలికి లాగి కొన్ని సెకన్ల పాటు అలాగే ఉంచండి. దీనిని 10-15 సార్లు రిపీట్ చేయండి.
బ్లోయింగ్ ఎయిర్ వ్యాయామం – ఈ ఎక్సర్‌సైజ్ చేయడానికి, లోతైన శ్వాస తీసుకోండి . తర్వాత వెంటనే పెదవుల ద్వారా గాలిని బయటకు ఊదండి. ఈ ప్రక్రియను తరుచుగా 2 నమిషాల పాటు చేయండి.
స్మైల్ ఎక్సర్‌సైజ్- ఓపెన్‌గా నవ్వి, ఆపై మీ బుగ్గలను క్రిందికి లాగి వాటిని పైకి ఎత్తండి.
కార్డియో వర్కౌట్- ముఖంపై కొవ్వును తగ్గించడానికి,ముందుగా శరీరంలోని కొవ్వును తగ్గించడం అవసరం. జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, జుంబా వంటి రోజువారీ కార్డియో వ్యాయామాలు శరీర కొవ్వును అలాగే ముఖంపై కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.
ప్రోటీన్ ,ఫైబర్ యొక్క వినియోగం- ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినడం ఆకలిని తగ్గిస్తుంది. ఇది అనవసరమైన కేలరీల వినియోగాన్ని తగ్గిస్తుంది. అందువల్ల, మీ ఆహారంలో పండ్లు, కూరగాయలు , తృణధాన్యాలు చేర్చుకోండి.
Also Read: శరీరం బలంగా ఉండాలంటే.. ఈ ఫుడ్ తప్పకుండా తినాల్సిందే !
చక్కెర , ఉప్పు తీసుకోవడం తగ్గించండి- చక్కెర , ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల ముఖంపై వాపు వస్తుంది. వీటిని తక్కువ పరిమాణంలో తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
తగినంత హైడ్రేషన్- పుష్కలంగా నీరు త్రాగడం వల్ల శరీరం నుండి విష పదార్థాలను తొలగిపోతాయి.అంతే కాకుండా ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగాలి.
నిద్ర, ఒత్తిడి :
తగినంత నిద్ర- నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. రోజు 7-8 గంటల నిద్ర తీసుకోండి.
ఒత్తిడి – యోగా, ధ్యానం, లోతైన శ్వాస పద్ధతులు ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతే కాకుండా బరువు , ముఖంపై కొవ్వును నియంత్రించడాన్ని సులభతరం చేస్తాయి.
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.