BigTV English

Drinking water:వర్షం నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Drinking water:వర్షం నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Do Rain water is safe for drinking..what doctors telling


వానా వానా వల్లప్పా అంటూ వానలో తడుస్తూ వెనకటి తరం ఎంజాయ్ చేసేవారు. ఇప్పడు వర్షంలో తడిస్తే వెంటనే జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. నాటి తరానికి నేటి తరానికి అదే తేడా. అయితే చాలా మందికి వాన నీటిని ఒడిసిపట్టి దానిని మంచినీటిగా ఉపయోగించుకుంటే ఎంతో ఆరోగ్యం అని భావిస్తుంటారు. వెనకటి కాలంలో అయితే కాలుష్యం చాలా తక్కువగా ఉండేది. దానితో నదులు, సముద్రాలు స్వచ్ఛంగా ఉండేవి. వాటర్ సైక్లింగ్ థీరీని అనుసరించి వర్షాలు పడతాయని అందరికీ తెలుసు. మారుతున్న కాలానికి వాతావరణ కాలుష్యం పెను ముప్పుగా వాటిల్లుతోంది. వాతావరణంలో వాయు కాలుష్యంతో ఆకాశంలో మేఘాలు సైతం కాలుష్యానికి లోనవుతున్నాయి. ఇన్ని కాలుష్యాల మధ్య స్వచ్ఛమైన వాన నీటిని ఆస్వాదించడం ప్రమాదకరమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

తాగునీటి అవసరాల కోసం


పూర్వ కాలంలో వాన నీటితో నిండిన చెరువులు, కుంటల నుంచి కుండలతో ఇంటికి తెచ్చుకుని వంటలు వండుకునేవారు. పైగా తాగునీటికి కూడా అవే నీటిని వాడుకునేవారు. ఇప్పుడు కేవలం శుద్ధిచేసిన నీటినే మనం వాడుకునే పరిస్థితి ఏర్పడింది. వాటిపైనా నమ్మకం లేక చాలా మంది ఇళ్ల లో వాటర్ ప్యూరిఫైర్ వాడుతున్నారు. ఆరోగ్యానికి ప్రయారిటీ నిచ్చే నేటి తరం ఈ విషయంలో మాత్రం చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. వర్షపు నీటిలో కంటికి కనిపించని సూక్ష్మ జీవులు ఉంటాయి. దానితోనే సీజనల్ జబ్బులు, వైరల్ ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి అని వైద్యులు చెబుతున్నారు. వర్షపు నీటిలో ఆల్కలీన్ శాతం అధికంగా ఉంటుంది. అదే నాలా వాటర్ శుద్ధి చేసి పంపిణీ చేస్తారు.

వర్షపు నీటిని మరిగించి

అయితే వర్షపు నీటిని మరిగించి చల్లార్చి తాగవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు వర్షపు నీటిని తాగడానికి తప్ప ఇతరత్రా అవసరాలకు వాడుకోవచ్చని చెబుతున్నారు. బట్టలు ఉతకడం, ఇంటిని ఒంటిని శుభ్రపరుచుకోవడం, మొక్కలకు నీటి అవసరాల కోసం వర్షపునీటిని వాడుకోవచ్చని అంటున్నారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు వర్షపు నీటిని అస్సలు తాగకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే బీపీ, షుగర్ ఉన్నవాళ్లు కూడా వర్షపు నీటిని సేవించకూడదని సూచిస్తున్నారు.

ఇంకుడు గుంతల ఆవశ్యకత

ప్రస్తుతం ప్రతి అపార్టు మెంటులలో వర్షపు నీటిని వృథా కాకుండా ఇంకుడు గుంతలను వృద్ధి చేస్తున్నారు. దీని వలన వర్షపు నీరు భూగర్భాలకు చేరుకుని భూగర్భ జలాలు ఇంకిపోకుండా సహాయ కారిగా ఉంటుంది. అయితే ఇంకుడు గుంతలలోని నీటిని ఎట్టి పరిస్థితిలోనూ తాగేందుకు ఉపయోగించరాదు. ఇంకుడు గుంతలలో నీటిని ట్యాంకులకు చేర్చుకునిన ఇతరత్రా అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని వైద్యులు సూచిస్తున్నారు. పాత తరం వాళ్లు వర్షపు నీటిని తాగి మేమంతా ఆరోగ్యంగా లేమా అని వాదిస్తుంటారు. అయితే అవన్నీ ఆ తరానికి అమోద యోగ్యమే కానీ నేటి తరానికి ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదు. పైగా హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Tags

Related News

Coconut Benefits: రాత్రి పూట కొబ్బరి తింటే.. మతిపోయే లాభాాలు !

Hair Fall: ఈ టిప్స్ పాటిస్తే.. జుట్టు ఊడమన్నా ఊడదు !

Malaria Fever: మలేరియా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !

TFM – Skin: TFM అంటే ఏమిటి? దీని వల్ల స్కిన్ సమస్యలు ఎలా వస్తాయో తెలుసా?

Face Mask For Pimples: ముఖంపై మొటిమలా ? ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

Plastic Cups: ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ, టీలను తాగుతున్నారా? వెంటనే మానేయండి.. లేదంటే?

Big Stories

×