BigTV English

Migraine Symptoms: సాధారణ తలనొప్పిని, మైగ్రేన్ నొప్పిని ఎలా గుర్తించాలో తెలుసా ?

Migraine Symptoms: సాధారణ తలనొప్పిని, మైగ్రేన్ నొప్పిని ఎలా గుర్తించాలో తెలుసా ?

Migraine Symptoms: కొంతమందికి తరచుగా తలనొప్పి సమస్య వస్తూ ఉంటుంది. కొందరికి కేవలం ఒకవైపు మాత్రమే నొప్పిగా ఉన్నా,, మరికొంత మందికి మాత్రం తలంతా నొప్పిగా ఉంటుంది. అయితే దీనిని సాధారణ తలనొప్పి లేదా మైగ్రేన్ నొప్పి అని అర్థం చేసుకోవడం కష్టం. అసలు సాధారణంగా వచ్చే తలనొప్పి, మైగ్రేన్ నొప్పికి తేడా ఏంటి, వాటి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.


మైగ్రేన్

మైగ్రేన్ నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఇది తరచుగా తల సగం భాగంలో వస్తుంది. ఈ నొప్పి మెడ, భుజాలు, కళ్ళు, చెవులను కూడా ప్రభావితం చేస్తుంది. దీనితో పాటు అసౌకర్యం, వాంతులు మొదలవడంతో పాటు కండరాలు దృఢత్వం వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి.


సాధారణ తలనొప్పి

సాధారణ తలనొప్పి తలలోని ఏ భాగంలోనైనా సంభవించవచ్చు. ఇది మొత్తం తలపై ప్రభావం చూపుతుంది. దీనికి ఇలాగే ఉంటాయనే లక్షణాలు ఉండవు. ఇది ఏ సమయంలోనైనా, ఎలా అయినా రావచ్చు.

మైగ్రేన్ స్టేజెస్..

మైగ్రేన్, తలనొప్పి రెండూ వివిధ రకాలు. మైగ్రేన్ నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశను ప్రోడ్రోమల్ దశ అని పిలుస్తాం. ఈ దశ నొప్పికి కొన్ని నిమిషాలు లేదా గంటల ముందు మొదలవుతుంది. చాలా మంది వ్యక్తుల్లో ఆవలింతలు లక్షణం ఉంటుంది. ఇది చాలా సాధారణ లక్షణం.

-తరువాతి దశ 30-40% మంది వ్యక్తులలో జరుగుతుంది. ఈ స్టేజ్‌లో 5 నిమిషాల నుండి ఒక గంట వరకు చేతులు జలదరించడం లేదా మాట్లాడడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.

-తర్వాత తలనొప్పి అని పిలుచుకునే మూడవ దశ వస్తుంది. తలనొప్పి ఎక్కువగా ఒకవైపు మాత్రమే ఉంటుంది. కానీ కొన్నిసార్లు రెండు వైపులా కూడా వస్తుంది. కానీ ఏదో సాధారణంగా వచ్చే తలనొప్పి వచ్చినట్లు అనిపిస్తుంది. దీనితో పాటు వాంతులు అయినట్లు కూడా అనిపిస్తుంది. ఎవరైనా నొప్పితో ఉంటే కాంతి, శబ్దాన్ని తట్టుకోలేరు. ఈ దశ 72 గంటల వరకు ఉంటుంది.

-పోస్ట్‌డ్రోమ్ అని పిలువబడే చివరి దశలో ఈ తలనొప్పి 24 గంటల్లో పూర్తిగా తగ్గిపోతుంది.

మైగ్రేన్‌కు కారణాలు ఏమిటి?

మైగ్రేన్ వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. ఒత్తిడి, తక్కువ నిద్ర, తక్కువగా తినడం, భోజనం మానేయడం, తక్కువగా నీరు త్రాగడం. దీనితో పాటు, ఈ రోజుల్లో చాలా వేడిగా ఉంటుంది. సూర్యకాంతి కూడా మైగ్రేన్‌కు కారణమవుతుంది. ఇవి మైగ్రేన్‌కు సాధారణ కారణాలు.

Related News

Migraine: మైగ్రేన్ తగ్గాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు !

Saggubiyyam Payasam: సగ్గుబియ్యం పాయసం.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్ !

Cheese Pasta: అద్భుతమైన రుచితో ‘చీజ్ పాస్తా’, ఇలా తయారు చేస్తే.. లొట్టలేసుకుంటూ తింటారు !

Brain Boosting Foods: ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచే ఫుడ్స్ ఏవో తెలుసా ?

Soaked Raisins: డైలీ ఉదయం నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే.. ఇన్ని లాభాలా ?

Natural Honey: స్వచ్ఛమైన తేనె vs కల్తీ తేనె – ఇంట్లోనే తేడా తెలుసుకోండి!

Face Scrub: ఈ ఫేస్ స్క్రబ్స్ వాడితే.. ముఖం మెరిసిపోతుంది తెలుసా ?

Sleep Fast Tips: నిద్ర పట్టడం లేదా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్

Big Stories

×