BigTV English

Winter Foods: ఈ చలిని తట్టుకోవాలంటే.. మీరు తినే ఆహారంలో ఇది ఎక్కువ ఉండాలి

Winter Foods: ఈ చలిని తట్టుకోవాలంటే.. మీరు తినే ఆహారంలో ఇది ఎక్కువ ఉండాలి

చలికాలం వస్తే చాలు శరీరానికి కొత్త అవసరాలు ఏర్పడతాయి. కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం అనేది శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మానసిక, శారీరక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి ఈ చల్లని వాతావరణంలో మీకు కావాల్సింది మెగ్నీషియం. శరీరంలో మెగ్నీషియం లోపం ఏర్పడితే చాలా పనులకు ఆటంకం కలుగుతుంది. శారీరక విధులు కూడా సక్రమంగా సాగవు. కాబట్టి మెగ్నీషియమ్ లోపం రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.


ఒత్తిడి ఆందోళన
శీతాకాలంలో వచ్చే ఇబ్బందుల్లో సీజనల్ ఎఫెక్టివ్ డిసార్డర్ ఒకటి. సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల ఈ డిజార్డర్ వస్తుంది. ఇది ఒక రకమైన డిప్రెషన్‌గా చెప్పుకోవచ్చు. మానసిక స్థితి తీవ్రంగా ప్రభావితం అవుతుంది. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది. అప్పుడు ఈ డిజార్డర్ రాకుండా ఉంటుంది. కార్టిసాల్ స్థాయిలను సమతుల్యం చేయడంలో కూడా మెగ్నీషియం పాత్ర అధికంగా ఉంటుంది. తగినంత మెగ్నీషియం తీసుకోవడం వల్ల మీ మానసిక స్థితి కూడా స్థిరంగా ఉంటుంది.

మెగ్నీషియంను యాంటీ స్ట్రెస్ మినరల్‌గా చెప్పుకుంటారు. ఇది శరీరం నుంచి వచ్చే ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ ఆహారంలో మెగ్నీషియం చేర్చడం వల్ల ఒత్తిడి నిర్వహించే శక్తిని అందించినట్టు అవుతుంది.


చలికాలంలో జలుబు, ఫ్లూ, వైరల్ ఇన్ఫెక్షన్లు అత్యధికంగా వస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చడంలో మెగ్నీషియం ముందుంటుంది. అలాగే శీతాకాలపు వ్యాధులు రాకుండా ఇది అడ్డుకుంటుంది. వ్యాధి కారకాలతో పోరాడడానికి అవసరమైన యాంటీ బాడీ ఉత్పత్తికి మెగ్నీషియం సహాయపడుతుంది. మెగ్నీషియం లోపం ఈ రోగనిరోధక ప్రతిస్పందనను బలహీన పరుస్తుంది. కాబట్టి మెగ్నీషియం లోపం రాకుండా చూసుకోండి.

చలికాలంలో మెగ్నిషియం లోపం ఏర్పడితే గుండె ఆరోగ్యానికి చిల్లు పడినట్టే. రక్తపోటు పెరగడం వల్ల గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కాబట్టి గుండెకు ఎలాంటి ఇబ్బంది రాదు. మెగ్నీషియం తగ్గితే రాత్రుల్లో సరిగా నిద్ర పట్టదు కూడా. మీరు నిద్రలేమి సమస్యతో బాధపడితే మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని తింటున్నారో లేదో చెక్ చేసుకోండి.

Also Read: బీరు తాగితే జుట్టు పెరుగుతుందా? ఇది ఎంతవరకు నిజం?

అధికంగా ఉండే ఆహారాలు
మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను ప్రతిరోజూ తినాల్సిన అవసరం ఉంది. గోధుమ పిండిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి చపాతీలు తినేందుకు ప్రయత్నించండి. పాలకూర కూడా మంచి మెగ్నీషియాన్ని అందిస్తుంది. క్వినోవా, బాదంపప్పులు, జీడిపప్పులు, వేరుశనగ పలుకులు, డార్క్ చాక్లెట్లు, బ్లాక్ బీన్స్, అవకాడోలు, పాలు, పెరుగు, అరటి పండ్లు రోజు తినడం ద్వారా మెగ్నీషియం లోపం రాకుండా అడ్డుకోవచ్చు.

Related News

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Fennel Seeds: సోంపు తినడం వల్ల ఎన్ని లాభాలుంటాయో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు !

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Big Stories

×