బీరు తాగితే అందంగా మారుతారని, జుట్టు పెరుగుతుందని ఎన్నో వాదనలు, అపోహలు ఉన్నాయి. బీరు తాగడం వల్ల అందంగా మారుతారు అనే వాదనతో ఎంతోమంది అబ్బాయిలు, అబ్బాయిలు తాగేందుకు ఇష్టపడుతున్నారు.
బీర్ ను బార్లీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, పోషకాలతో పాటు కొంత ఆల్కహాల్‌ను కలిపి చేస్తారు. బీర్ తక్కువగా తీసుకుంటే అవి చర్మాన్ని మెరిపిస్తాయని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. అయితే మితంగా తీసుకోకుండా అధికంగా తాగి అనారోగ్యం బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోయింది. ప్రతిరోజు బీరు తాగేవారు మితంగా తాగాల్సిన అవసరం ఉంది. అమితంగా తాగితే డిప్రెషన్, బరువు పెరగడం, కాలేయ సమస్యలు రావచ్చు. బీర్లలో విటమిన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి చర్మానికి మెరుపు వస్తుంది. అలాగే ఇది సహజమైన క్లెన్సర్ లా ఉపయోగపడుతుంది. గుండె, ఎముకలు, రక్తంలో చక్కెర స్థాయిలపై ఇది సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే అతిగా తాగితే మాత్రం ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి.
బీరుతో జుట్టు ఎలా పెరుగుతుంది?
ఎంతోమందికి బీరు తాగడం వల్ల జుట్టు పెరుగుతుందనే వాదన ఉంది. బీరులో జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్ బి6, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్ నిండుగా ఉంటాయి. బీరులోని ప్రోటీన్లు జుట్టులోని తంతువులను బలోపేతం చేయడానికి సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే బీరులో ఉండే యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు కూడా మాడును ఆరోగ్యకరంగా ఉండేలా ప్రేరేపిస్తుంది. జుట్టు మందంగా పెరగడానికి బీరు సహకరిస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే జుట్టులోని తేమను బీర్ లాక్ చేస్తుందని పొడితనాన్ని తగ్గిస్తుందని అంటారు.
బీరుతో తలస్నానం?
తలపై బీర్‌ను పోసి రుద్దుకోవడం వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది. జుట్టు పెరుగుదలకు కూడా తోడ్పడుతుంది. చుండ్రును తగ్గించడానికి కూడా బీరు అద్భుతంగా పనిచేస్తుంది. బీర్‌ను కొంత మాడుకు తగిలేలా రాసి కాసేపు వదిలేయాలి. ఆ తర్వాత తలకు స్నానం చేయాలి. చుండ్రు త్వరగా తగ్గిపోతుంది. బీర్ సహజమైన కండిషనర్ లా కూడా పనిచేస్తుంది. గాలి కాలుష్యము, పర్యావరణం వల్ల జుట్టుకు కలిగే నష్టాన్ని ఇది తగ్గిస్తుంది. 2009లో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ సైన్స్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం బీరులో ఉండే మాల్ట్ జుట్టు ఆకృతిని కాపాడి, బలంగా పెరిగేలా చేస్తుందని చెప్పారు. అయితే వారానికి ఒకటి రెండు సార్లు బీరుతో తలకు హెయిర్ ప్యాక్ వేసుకునేందుకు ప్రయత్నించండి. మీరు ఈ ప్రయోజనాలను పొందే అవకాశం.
Also Read: మీరు చేసే ఈ తప్పులు మీకు బట్టతల రావడానికి కారణంగా మారుతాయి
బీర్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి కదా అని ప్రతిరోజూ బాటిళ్లు ఎత్తి దించుతామంటే కుదరదు. అందం కన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యంగా ఉంటే అందం దానంతట అదే వస్తుంది. కాబట్టి అందం కోసం బీరును అధికంగా వాడకండి. ప్రాణాంతక సమస్యలను తెచ్చుకోవద్దు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.