Dry Fruits in Summer: తరచూ డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచివే అయినా ఎండాకాలంలో వీటిని తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. అయితే డ్రైఫ్రూట్స్‌ను డైరెక్ట్‌గా తినడం వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా.. నానబెట్టినవి తినడం వల్ల ఎటువంటి సమస్యలు ఉండవని అసలు వీటిని తినే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి కాలంలో చాలా వరకు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. కొన్నిటి వల్ల శరీరానికి మేలు కంటే హానీ ఎక్కువగా ఉంటుంది. వేసవికాలంలో వేడి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల శరీరంలో వేడి చేసి సమస్యలకు దారి తీస్తుంది. అయితే ముఖ్యంగా డ్రైఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. కానీ వీటిని తినడం వల్ల శరీరంలో వేడి కూడా పెరుగుతుంది. ఇది నిజమే అయినా తినే విధానంలో మార్పులు చేస్తే ఎటువంటి సమస్యలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.
Also Read: పుచ్చకాయలోని గింజలను పడేస్తున్నారా.. పొరపాటు చేసినట్లే
ఎండాకాలంలో డ్రైఫ్రూట్స్ తీసుకునే వారు తక్కువ మోతాదులో తీసుకోవాలి. అంతేకాదు వీటిని తీసుకునే సమయంలో డైరెక్ట్ గా కంటే రాత్రంతా నీళ్లలో నానాబెట్టి తినాలని అంటున్నారు. అందువల్ల ఒంట్లో వేడి పుట్టే అవకాశాలు తక్కువ ఉంటాయట. అయితే డ్రైఫ్రూట్స్ లో బాదంను తినడం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉటుంది. అందువల్ల రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే దానిని తొక్క తీసి తినాలి. అత్తిపండ్లు, ఎండుద్రాక్ష, వాల్ నట్స్ వంటి వాటిని కూడా రాత్రంతా నీళ్లలో నానబెట్టి తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.