Big Stories

Dry Fruits @ Early Morning: ఉదయాన్నే ఈ డ్రైఫ్రూట్స్ అస్సలు తినొద్దు..

- Advertisement -

Dry Fruits: ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే చాలా మంది ఉదయాన్నే మంచి ఫుడ్ తీసుకోవాలని అనుకుంటారు. అందుకోసం ముందుగా మొలకెత్తిన గింజలు, డ్రైఫ్రూట్స్‌ని ఎంచుకుంటారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మొలకెత్తిన గింజలు తినడం వల్ల చాలా సేపటి వరకు ఆకలి బాధను తగ్గిస్తుంది. ఇక డ్రైఫ్రూట్ తినడం వల్ల వాటిలోని విటమిన్ సీ, మెగ్నీషియం, పొటాషియం, ఫొలేట్, ప్రోటీన్ వంటి పోషకాలు ఎన్నో అందుతాయి. ఉదయం పూట డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మంచిదే అయినా.. కొన్ని డ్రై ఫ్రూట్స్ ని మాత్రం ఉదయం పూట తీసుకోవడం అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ బ్యాలెన్స్ డ్ న్యూట్రీషన్ ఫుడ్ తీసుకుంటే మంచిదట. అయితే ఒకే రకమైక పోషక విలువలు కలిగిన డ్రైఫ్రూట్స్ ని మాత్రం అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయట. మరి ఆ డ్రైఫ్రూట్స్ ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

1. కిస్ మిస్..
పరగడుపున(ఖాళీ కడుపుతో) ఎండు ద్రాక్షను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ద్రాక్షలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, న్యాచురల్ షుగర్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎనర్జీ బూస్టింగ్ ఇస్తాయి. కానీ వీటిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ అకస్మాత్తుగా పెరిగిపోతుందట. దీని వల్ల నీరసం ఏర్పడుతుంది.

2. డ్రై చెర్రీస్
డ్రై చెర్రీస్‌ని ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు. యాసిడ్ రిఫ్లక్స్, హార్ట్ బర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రై చెర్రీస్‌లో ఎసిడిటీ లెవల్స్ ఎక్కువ ఉంటాయి. అంతేకాదు డ్రై చెర్రీస్‌లో ఉండే ఫ్రక్టోజ్ ప్రేగుల ద్వారా శోషించబడని పిండి పదార్థాలను తయారు చేస్తోంది. దీంతో గ్యాస్, పొట్ట ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు ఎదురవుతాయి.

3. ఖజ్జురం
ఉదయాన్నే ఖజ్జుర పండును తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల బాడీలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీంతో ఒక్కసారిగా నీరసపడిపోతారు. అంతేకాదు ఉదయాన్నే ఖర్జూర పండు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగాలో మీకు తెలుసా ?

4. డ్రై ఆఫ్రికాట్లు
డ్రై ఆఫ్రికాట్స్‌లో హై షుగర్ లెవల్స్ ఉంటాయి. వీటిని పరగడపున తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు ఎదురవుతాయి. ఎండిన, పచ్చి ఆప్రికాట్‌లో గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లు అధికంగా ఉంటాయి. ఒకవేళ వీటిని తినాలనుకుంటే పనీర్ లేదా ప్రోటీన్ ఉండే పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు.

ఇవి తింటే ఆరోగ్యానికి మంచిదే..
డ్రై ఫ్రూట్స్ బదులుగా ఉదయాన్నే ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

ఓట్ మీల్
పెరుగు
గుడ్లు
తాజా బెర్రీలు
బ్రెడ్
స్మూతీస్
అవకాడో

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News