Big Stories

Effects of Eating Eggs: కొలస్ట్రాల్ ఉన్నా కోడిగుడ్డు తింటున్నారా..? ఈ సమస్యలు తప్పవు!

Effects Of Eating Eggs
Effects Of Eating Eggs

Effects of Eating Eggs: ప్రస్తుత కాలంలో జీవనవిధానం పూర్తిగా మారిపోయింది. హడావిడి, బిజీబిజీ లైఫ్ స్టైల్ లో ఉరుకులు, పరుగులు పెడుతుంటారు పట్టణవాసులు. కనీసం తినడానికి కూడా వారికి స
మయం దొరకదు. ఈ తరుణంలో ఏదో దొరికింది తినేసి, కొన్నిసార్లు పూర్తిగా తినకుండా కూడా పనులు చేసుకుంటున్నారు. దీని వల్ల ఉబకాయం బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

సిటీ లైఫ్‌స్టైల్‌కు అలవాటు పడిన చాలా మంది ఇప్పటికే హై కొలస్ట్రాల్ సమస్యను ఎదుర్కుంటున్నారు. ఇంట్లో వంట చేసుకునే సమయం లేకపోవడం, హాస్టల్ ఫుడ్ తినలేక హోటల్స్, రెస్టారెంట్ల భోజనానికి అలవాటు పడి ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటున్న వారిలో పట్టణ వాసులు అధికంగా ఉంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఎదుర్కుంటున్న వారు తీసుకునే ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు ఒకటి. ఈజీగా చేసుకునే వంట కోడిగుడ్డు కూర. ఇది తినడం మంచిదని కోడిగుడ్డును ఉడకపెట్టుకుని కూడా తినేసి వెళిపోతుంటారు. హై కొలస్ట్రాల్ ఉన్న వ్యక్తులు అసలు కోడిగుడ్డు తినొచ్చా..? కోడిగుడ్డు తినడం వల్ల నష్టాలు ఏంటి? లాభాలు ఏంటి? తెలుసుకుందాం.

- Advertisement -

హై కొలస్ట్రాల్ సమస్యను ఎదుర్కుంటున్న చాలా మంది కోడిగుడ్డు తినడం ఆరోగ్యానికి అంతమంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు కోడిగుడ్డు తీసుకోవడం వల్ల ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ఎగ్స్ తినడం మూలంగా గుండె సంబంధింత జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుందని అంటున్నారు.

Also Read: Summer Food: వేసవిలో ఇవి తినండి.. అందంతో పాటు ఆరోగ్యం మీ సొంతం

  1. చెడు కొలస్ట్రాల్ పెరుగుతుంది:

హై కొలస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు తరచూ ఆహారంలో కోడిగుడ్డును తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాన్ని 2019లో జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అధ్యయనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఎగ్స్ లో ఉండే పచ్చ సోనలో హై కొలస్ట్రాల్ కంటెంట్ అధికంగా ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో హై కొలస్ట్రాల్ ఉన్న వ్యక్తులు ఎగ్స్ తినడం వల్ల గుండె సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. ఇందులో 12 వారాలు రోజు గుడ్డు తినే వ్యక్తులు, గుడ్డు తినని వ్యక్తుల కంటే ఎక్కుడు చెడు కొలస్ట్రాల్ కలిగి ఉంటారని శాస్త్రవేత్తలు అధ్యయనంలో కనుగొన్నారు.

2. ఎగ్స్‌‌తో వెయిట్ గేన్:

అధిక కొలస్ట్రాల్ ఉన్నవారు కోడిగుడ్డు తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉంటాయట. ఎగ్స్ లో ఉండే కేలరీల మూలంగా బరువు పెరగవచ్చని చెబుతున్నారు.

Also Read: Crying Rooms In America: ఏడ్చేవాళ్ల కోసం ప్రత్యేక పార్లర్.. ఎక్కడుందో తెలుసా..

3. అధిక రక్తపోటు:

కోడిగుడ్డులో ఉండే సోడియం మూలంగా అది తినడం వల్ల అధిక రక్తపోటును పెంచుతుందట. దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని.. నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల అధిక కొలస్ట్రాల్‌తో బాధఫడుతున్న వారు కోడిగుడ్డు తినడం మానేయాలని చెబుతున్నారు. ఉదయాన్నే బాయిల్డ్ ఎగ్ తినడం మంచిదని భావించి అనారోగ్యానికి గురికాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News