BigTV English

Summer Food to Improves Health and Beauty: వేసవిలో ఇవి తినండి.. అందంతో పాటు ఆరోగ్యం మీ సొంతం!

Summer Food to Improves Health and Beauty: వేసవిలో ఇవి తినండి.. అందంతో పాటు ఆరోగ్యం మీ సొంతం!
summer food
summer food

Summer Food to Improves Health and Beauty: వాతావరణంలో తరచూ చోటుచేసుకునే మార్పులు ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. అందులోను వేసవికాలం మొదలైపోయింది. ఎండలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే జనాలు భయపడిపోతున్నారు. మండుతున్న ఎండల కారణంగా బయటికి వెళితే వడదెబ్బ తగులుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎండలో తిరగడం మూలంగా చెమటలు కారిపోతాయి. దీంతో శరీరంలోని వాటర్ మొత్తం చెమట రూపంలో బయటికి వెళిపోతుంది. దీనివల్ల ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం కూడా దెబ్బ తింటుంది. ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలని చాలా మంది ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం కూడా చాలా వరకు మానేస్తారు. అయితే దీనికి చాలా రకాలు సొల్యూషన్స్ ఉంటాయి. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి పండ్లు, ఆహార పదార్థాలు తీసుకోవాలి? తెలుసుకుందాం.


ఎండల్లో బయట తిరుగుతూ కూడా చర్మ కాంతిని రక్షించుకోవచ్చు. వేసవికాలంలో ఎక్కువగా దొరికే పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. చర్మ కాంతిని పెంచుకోవచ్చు. ఈ తరుణంలో వేసవిలో దొరికే చాల రకాల పండ్లతో మరి కొన్ని పండ్లతో కూడా ఆరోగ్యాన్ని, చర్మాన్ని కాపాడుకోవచ్చని చాలా మందికి తెలియదు.

1. నీటి శాతం ఎక్కువ ఉండే పండ్లు తీసుకోవాలి..


వేసవికాలంలో నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు. అంతేకాదు ఎండల వల్ల వేడి చేయకుండా శరీరాన్ని చల్లబరుచుకోవచ్చు. నీటి శాతం ఉండే తాజా పండ్లైన తర్బూజా, పుచ్చకాయ, దానిమ్మ, జామకాయ వంటి పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. దీనివల్ల ఎక్కువగా ఆకలి వేయకుండా కూడా చూసకోవచ్చు.

Also Read: Benefits Of Lemon Water: ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

2. క్యాప్సికం..

వేసవికాలంలో క్యాప్సికం తీసుకోవడం చాలా మంచిది. ఎండలు కారణంగా చెమట పట్టి చర్మం ముడతలు బారే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో రెడ్ క్యాప్సికం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రెడ్ క్యాప్సికంలో ఉండే విటమిన్ సీ చర్మ కాంతిని రక్షించేందుకు తోడ్పడుతుంది. విటమిన్ సీతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. మరోవైపు కమలాపండును వేసవిలో తీసుకుంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందని, నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల చర్మ కాంతికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

3. కూరగాయలు తీసుకోవడం మేలు..

ఎండాకాలంలో కొన్ని కూరగాయలు తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేష్ కు గురికాకుండా చూసుకోవచ్చు. కీరదోస, సోరకాయ, బీరకాచ. క్యారెట్ వంటి కూరగాయల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎండాకాలం మొత్తం ఈ కూరగాయలను తీసుకోవడం ఆరోగ్యానికి, చర్మానికి మంచిది. వీటిలో ఉండే పోషకాలు చర్మానికి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. కీరదోసను సలాడ్ లా తీసుకోవడం వల్ల బాడీలో నీటి శాతం పెంచుకోవచ్చు. క్యారెట్ ను జ్యూస్ చేసి తీసుకున్న మంచి లాభం ఉంటుంది.

 

Tags

Related News

Fatty Liver: ఈ డ్రింక్ తాగితే.. ఫ్యాటీ లివర్‌కు చెక్ !

Tips For Tan Removal: ముఖంపై ట్యాన్.. తొలగిపోవాలంటే ?

Dandruff: ఈ టిప్స్ పాటిస్తే.. చుండ్రు ఈజీగా తగ్గిపోతుంది తెలుసా ?

Bad Breath: నోటి దుర్వాసన తగ్గాలంటే ?

Cold: జలుబు తగ్గాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి ?

Corn Silk Benefit: మొక్కజొన్న తిని, అది పారేస్తున్నారా? దాంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

Big Stories

×