Big Stories

Papaya Leaf Benefits: బొప్పాయి ఆకులతో అనేక ప్రయోజనాలు.. ఆ వ్యాధులకు చెక్

Papaya Leaf Benefits
Papaya Leaf Benefits

Papaya Leaf Benefits: ఆరోగ్యానికి పండ్లే కాదు వాటి ఆకులు కూడా చాలా రకాలుగా ఉపయోగపడతాయి. అందులో బొప్పాయి(papaya) పండు ఆకు ఆరోగ్యానికి చాలా రకాలుగా సహకరిస్తుంది. సహజంగా లభించే ఈ బొప్పాయి ఆకు మన శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచడంలోను సహాయపడుతుంది. అయితే బొప్పాయి ఆకుతో చాలా రకాల వ్యాధులను కూడా నియంత్రిచవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

బొప్పాయి పండు తింటే మన శరీరానికి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో.. అదే మాదిరిగా బొప్పాయి ఆకు తింటే కూడా అంత కంటే ఔషధ గుణాలు లభిస్తాయని చెబుతున్నాయి. ఈ పండులో ఉండే ఔషధ గుణాలు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఔషధంగా పనిచేస్తుందని అంటున్నారు. బొప్పాయి ఆకుల్లో ఉండే పోషకాలు జీర్ణక్రిమయ శక్తిని పెంచుతాయని అంటున్నారు. ఇందులో పచ్చి, పండిన బొప్పాయి రెండూ ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయని అంటున్నారు. ఈ క్రమంలో బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయట.

- Advertisement -

బొప్పాయి రసం..

బొప్పాయి రసం తాగడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. బొప్పాయి పండులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలే ఆకులోను ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆకులలో ఉండే ఔషధ గుణాలు కడుపులో రాళ్లను కరిగించేందుకు ముఖ్య పాత్ర పోషిస్తాయని అంటున్నారు. ఇది జీర్ణశక్తిని పెంచి ఆకలి వేయడానికి కూడా తోడ్పడుతుందని వైద్యులు అంటున్నారు. బొప్పాయి ఆకులలో ఉండే పోషకాలు ఎలాంటి వ్యాధులు రాకుండా చూస్తుంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ చేసిన అధ్యయనంలో తేలినట్లు ఓ నివేదికలో వెల్లడించింది. అంతేకాదు ఆసియా ఖండంలో చాలా చోట్ల బొప్పాయి ఆకులను ఔషధాలకు ఉపయోగిస్తారని కూడా ఈ అధ్యయనం తెలిపింది.

భారతదేశం ఔషధాలకు నిలయం అని అంటారు. మన దేశంలో తయారుచేసే ఔషధాలలో బొప్పాయి ఆకులను కూడా ఉపయోగిస్తారు. బొప్పాయి ఆకులలో ఉండే పోషకాలు, ఔషధ గుణాలు వ్యాధులను నయం చేసేందుకు ఉపయోగపడతాయి. ఇండియాలో ప్రాచుర్యం పొందిన ఆయుర్వేద ఔషధాల్లో బొప్పాయికి ప్రత్యేక ఉంది. డెంగ్యూ నివారణకు బొప్పాయి ఆకు రసం చాలా బాగా పని చేస్తుంది. క్యాన్సర్, న్యూరోప్రొటెక్టివ్, యాంటీ డయాబెటిక్ వంటి వ్యాధులతో కూడా పోరాడే ఇన్ఫ్లామేటరీ లక్షణాలు బొప్పాయి ఆకు రసంలో ఉన్నాయి.

బొప్పాయి రసాన్ని ఉపయోగించే ముందు వైద్యుల సలహాలు తప్పని సరిగా తీసుకోవాలి. ఈ రసం ఔషధమే అయినా అన్ని రోగాలకు ఉపయోగపడకపోవచ్చు. అందువల్ల అనారోగ్యం బారినపడిన వారు వైద్యుల సూచన మేరకు మాత్రమే దీనిని ఉపయోగించాలి. బొప్పాయి ఆకులలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఎంజైములు, ఖనిజాలు, ఆమ్లాలు, ఆల్యలాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు, అమైనో ఆమ్లాలు, గ్లైకోసైడ్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News