BigTV English

Winter Skin Care: చలికాలంలో చర్మాన్ని కాపాడుకోండిలా ?

Winter Skin Care: చలికాలంలో చర్మాన్ని కాపాడుకోండిలా ?

Winter Skin Care: వింటర్ సీజన్ మొదలవగానే చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. చర్మం పొడిబారడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైన సమస్య. చర్మం ఎక్కువ కాలం పొడిగా ఉంటే అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. చర్మం పొడిగా మారడంతో పాటు స్కిన్‌పై మంటలు కూడా మొదలవుతాయి. చల్లని గాలి, తక్కువ తేమ కారణంగా, చర్మం తేమను కోల్పోయి పొడిగా మారుతుంది.


మీ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుకోవడానికి కొన్ని పద్ధతులు మీకు బాగా ఉపయోగపడతాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, మృదుత్వం, మెరుపును తీసుకురావడంలో సహాయపడతాయి.వాటి గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

5 విధాలుగా చర్మం మృదువుగా మార్చుకోవచ్చు: 


మాయిశ్చరైజర్ రెగ్యులర్‌గా ఉపయోగించడం: మాయిశ్చరైజర్‌ను రోజుకు 2-3 సార్లు ఉపయోగించండి. మీ చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడు స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్‌ని అప్లై చేయండి. హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్ లేదా షియా బటర్ వంటి మాయిశ్చరైజింగ్ ఏజెంట్లను కలిగి ఉండే మాయిశ్చరైజర్‌ను ఎంచుకోండి. ఇవి చర్మాన్ని తేమగా ఉండేలా చేస్తాయి. అంతే కాకుండా చర్మం పొడి బారకుండా కాపాడతాయి.

వేడి నీటితో స్నానం చేయకూడదు: వేడి నీరు మీ చర్మంపై నుంచి సహజ నూనెలను తొలగిస్తుంది. ఒక వేళ గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మాయిశ్చరైజర్ చలికాలంలో చర్మాన్ని కాపాడుతుంది.

హ్యూమిడిఫైయర్ యొక్క ఉపయోగం: గదిలో హ్యూమిడిఫైయర్ను ఉంచుకోండి . ఇది గాలికి తేమను జోడించి మీ చర్మం పొడిబారకుండా చేస్తుంది. దీని వల్ల చర్మం తాజాగా ఉంటుంది.

హోం రెమెడీస్..
తేనె. పెరుగు మాస్క్: తేనె, పెరుగు మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

అలోవెరా: అలోవెరా జెల్ చర్మాన్ని మృదువుగా మాయిశ్చరైజ్ చేస్తుంది. దీన్ని రోజు ముఖానికి రాసుకోవడం వల్ల మంచి లాభాలు ఉంటాయి. చర్మ సౌందర్యానికి అలోవెరా ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మారుస్తుంది.

బాదం నూనె: పడుకునే ముందు బాదం నూనెను ముఖానికి పట్టించాలి. ఇది చర్మానికి పోషణనిస్తుంది. అంతే కాకుండా చర్మంపై మొటిమలు రాకుండా చేస్తుంది.

ఆరోగ్యకరమైన ఆహారం: పుష్కలంగా నీరు త్రాగాలి. మీ ఆహారంలో పండ్లు, కూరగాయలను చేర్చండి. విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

Also Read: ఇవి వాడితే.. చందమామ లాంటి మచ్చలు లేని ముఖం మీ సొంతం

అదనపు చిట్కాలు:

శీతాకాలంలో సూర్యకిరణాల నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్ ఉపయోగించండి.
ఇంటి లోపల కూడా సూర్యకాంతిలో కూర్చోవడం మానుకోండి.
పొడి చర్మం కోసం తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగించండి.
క్రమం తప్పకుండా ఎక్స్‌ఫోలియేట్ చేయండి. కానీ అతిగా చేయకూడదు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Natural Face Packs: ఫేస్ క్రీములు అవసరమే లేదు, ఈ ఫేస్ ప్యాక్స్‌తో మెరిసే చర్మం

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Big Stories

×