BigTV English

Fennel Water: ఈ డ్రింక్ త్రాగితే .. బండ లాంటి కొవ్వు కూడా కరగాల్సిందే !

Fennel Water: ఈ డ్రింక్ త్రాగితే .. బండ లాంటి కొవ్వు కూడా కరగాల్సిందే !

Fennel Water: ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నా పెద్దా తేడా లేకుండా స్థూలకాయంతో పడరాని పాట్లు పడుతున్నారు. కొంత మంది పెరిగిన బరువును తగ్గించుకోవడానికి జిమ్‌లకు కూడా వెళుతుంటారు. మరికొంత మందికి జిమ్ వెళ్లేందుకు సమయం ఉండదు. అలాంటి వారు ఇంట్లోనే కొన్ని రకాల టిప్స్ పాటించి బరువును ఈజీగీ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా హోం రెమెడీస్ బరువును తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. అంతే కాకుండా ఇవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగించవు. ఇదిలా ఉంటే సోంపు బరువు తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. సోంపును ఫెన్నెల్ అని కూడా పిలుస్తారు. సోంపు నీరు త్రాగడం వల్ల తక్కువ సమయంలోనే బరువు తగ్గొచ్చు.


ఫెన్నెల్ వాటర్ శరీరానికి ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. దీన్ని రోజు తాగితే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. బరువు తగ్గడానికి సోంపు నీటిని ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లీ ఫ్యాట్ కోసం ఫెన్నెల్ వాటర్ తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. ఇది రోజంతా శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు దీన్ని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడి నిద్రలో కేలరీలు ఖర్చవుతాయి. అంతే కాకుండా దీనిని భోజనం తర్వాత తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.


ఫెన్నెల్ వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
ఫెన్నెల్ వాటర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడానికి , బరువు తగ్గించడానికి శతాబ్దాలుగా ఉపయోగించబడుతోంది. ఫెన్నెల్ వాటర్‌లో పోషకాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శరీరం నుండి వ్యర్థ పదార్థాలు తొలగించడంలో సహాయపడుతుంది.

ఫెన్నెల్ వాటర్ మీ జీవక్రియను పెంచుతుంది. అంతే కాకుండా ఇది మీ శరీరంలోని కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

సోంపులో యాంటీ-ఆక్సిడెంట్లతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా ఇది కడుపులో గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది.

సోంపు శరీరాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ఇది బరువు తగ్గించడంలో చాలా ప్రభావవంతగా పనిచేస్తుంది.

ఫెన్నెల్ వాటర్ ఆకలిని నియంత్రిస్తుంది. కాబట్టి మీరు తరచుగా తినడం దీన్ని త్రాగడం అలవాటు చేసుకోండి.

ఫెన్నెల్ వాటర్ ఎలా తయారు చేయాలి:

ఒక పాన్‌లో ఒక గ్లాసు నీళ్లు పోసి అందులో 1-2 టీస్పూన్ల సోంపు వేయాలి. తక్కువ మంట మీద 5-7 నిమిషాలు ఉడికించాలి. తర్వాత నీటిని వడకట్టి కప్పులో వేయాలి. రుచిని మెరుగుపరచడానికి తేనెను కలుపుకోవచ్చు.

మీరు సోంపు వాటర్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడంతో పాటు మీ రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామాలను కూడా చేస్తే.. మీరు త్వరలో అద్భుతమైన ఫలితాలను చూస్తారు.

సోంపు వాటర్ ద్వారా బెల్లీ ఫ్యాట్ ఈజీగా తగ్గుతుంది. అంతే కాకుండా ఇది త్రాగడం వల్ల మీ శరీరం తేలికగా ఉంటుంది. మీ చర్మం కూడా మెరుస్తుంది.

Also Read:  వీటితో.. థైరాయిడ్‌ను ఈజీగా తగ్గించుకోవచ్చు

గమనించవలసిన విషయాలు:

బెల్లీ ఫ్యాట్ తగ్గడం కోసం ఫెన్నెల్ వాటర్ , సోంపును ఎక్కువగా తీసుకోవద్దు. ఎందుకంటే ఇది దుష్ప్రభావాలను కూడా కలిగించవచ్చు. ఫెన్నెల్ వాటర్‌తో పాటు, సమతుల్య ఆహారం , క్రమం తప్పకుండా వ్యాయామం కూడా అవసరం. మీరు ఏదైనా మందులు వాడుతున్నట్లయితే లేదా ఏదైనా ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, ఫెన్నెల్ వాటర్ తాగే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×