Samsung Galaxy S25 Edge : టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్సాంగ్ అన్ ప్యాక్డ్ ఈవెంట్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. జనవరి 22న కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో ఎంతో గ్రాండ్ గా జరిగిన ఈ ఈవెంట్లో అదిరిపోయే ఫీచర్స్ తో Galaxy S25 సిరీస్ లాంఛ్ అయిపోయింది. ఇక ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్ గా ఎడ్జ్ సిరీస్ నిలిచింది.
Samsung Galaxy S సిరీస్లో భాగంగా Samsung Galaxy S25 సిరీస్ లాంఛ్ అయిపోయింది. ఇందులో Galaxy AI ఫీచర్స్ తో Galaxy S25, Galaxy S25 Plus, Galaxy S25 అల్ట్రాతో లాంఛ్ అయ్యాయి. ఇందులో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన మెుబైల్ Samsung Galaxy S25 Slim. ఇదే Galaxy S25 Edge. Galaxy S25 లైనప్‌లో కొత్త ఎంట్రీ ఇచ్చిన ఈ మెుబైల్ ను సామ్సాంగ్ ఎంతో గ్రాండ్ గా తీసుకువచ్చేసింది.
Galaxy S25 Edge స్లిమ్ మెుబైల్. ఈ మెుబైల్ ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ కోసం ఈ ఈవెంట్లో పూర్తి సమాచారం ఇవ్వనప్పటికీ.. ‘ఎడ్జ్’ ట్యాగ్‌తో లాంఛ్ కావటంతో సామ్సాంగ్ ఎడ్జ్ మెుబైల్ ఫీచర్స్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 2016లో లాంఛ్ అయిన Galaxy S7 ఎడ్జ్ డిజైన్‌ను గమనించినట్లయితే.. Galaxy S25 Edge నిజానికి Galaxy S25+ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ మోడల్ ను చూసి అంచనా వేయటం కష్టమైనప్పటికీ ఈ S25 సిరీస్ మొబైల్స్ తో పోలిస్తే ఎడ్జ్ మొబైల్ కెమెరా డిజైన్ వేరుగా ఉందనే చెప్పాలి. ఇందులో ప్రతీ మెుబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వచ్చేసింది. అయితే గెలాక్సీ S25 ఎడ్జ్ డ్యూయల్ కెమెరాతో LED ఫ్లాష్ లైట్ తో రెండు వేర్వేరు లెన్స్‌తో వచ్చేసింది.
ALSO READ : ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఆ చేప.. ఇక విధ్వంసమేనా?
Galaxy S25 Edge కెమెరా డిజైన్‌ను సామ్సాంగ్ స్పెషల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఫోన్ కోసం స్లిమ్ ప్రొఫైల్‌ను ఉంచడానికి కంపెనీ రెండు కెమెరాలను మాత్రమే డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఫోన్ నేరుగా రాబోయే ఐఫోన్ 17 ఎయిర్‌తో పోటీ పడునున్నట్లు తెలుస్తుంది. కాబట్టి, గెలాక్సీ S25 ఎడ్జ్ కంటే స్లిమ్ మెుబైల్ ను తీసుకురావాలంటే యాపిల్ సింగిల్ కెమెరా సెటప్ ను మాత్రమే తీసుకురావాలనే టాక్ కూడా వినిపిస్తుంది.
Samsung Galaxy S25 Edge మెుబైల్ 6.66 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చేసింది. ఇది Galaxy S25+ మోడల్‌కు సమానమైన ఫీచర్స్ తో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఫోన్ కెమెరా మాడ్యూల్ లేకుండా 6.4 mm సన్నని ప్రొఫైల్‌తో వచ్చేసింది. అయితే ఇది కెమెరా యూనిట్ చుట్టూ 8.3 mm మందంను కలిగి ఉంది. ఇది 200 MP ప్రైమరీ సెన్సార్ హెడ్‌లైన్‌తో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. Samsung ఫ్లాగ్ షిప్ లైనప్‌లోని వచ్చేసిన మెుడల్స్ తో సమానంగా Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఇది 12GB RAM, ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ను కలిగి ఉంది.