Big Stories

Fruit Juices: పండ్లు VS పండ్ల రసాలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్ ?

Fruit Juices: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తరచూ తీసుకునే ఆహార పదార్థాలలో పండ్లు తప్పకుండా ఉండాలి. పండ్లలోని విటమిన్లు, ప్రోటిన్లు, ఖనిజాలు శరీరానికి శక్తిని ఇచ్చి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. అంతేకాదు శరీరం అందంగా, బలంగా ఉండేలా కూడా తోడ్పడుతాయి. అయితే తరచూ పండ్లు, పండ్ల రసాలు తాగుతుంటాం. కానీ చాలా మంది ఇందులో ఏది చేస్తే ఆరోగ్యానికి మంచిది అని ఆలోచిస్తుంటారు. మరి ఆరోగ్య నిపుణులు ఏం అంటున్నారో తెలుసుకుందాం.

- Advertisement -

పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పండ్లను తినలేకపోతే జ్యూస్ చేసుకుని మరి తాగుతుంటారు. అయితే పండ్లలో ఉండే ఫైబర్, వాటిని జ్యూస్ చేసిన తర్వాత కోల్పోతుంది. తాజాగా ఉండే పండ్లలో విటమిన్లు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, జింక్, ఖనిజాలు వంటివి అత్యధికంగా ఉంటాయి. అయితే పండ్ల రసాలు తీసుకుంటే శరీరంలోని రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగేలా చేస్తుందట. పండ్ల కంటే పండ్ల రసాలలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి.

- Advertisement -

Also Read: బరువు తగ్గడానికి నిద్ర కూడా అవసరమే..

పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ పండ్ల రసాన్ని తయారు చేసే క్రమంలో అవి కోల్పోతాయి. ముఖ్యంగా విటమిన్ సీ ఉండే పండ్లను జ్యూస్ చేసి తాగడం వల్ల అందులోని విటమిన్ సీని కోల్పోతుందట. అందువల్ల పండ్ల రసాలతో పోలిస్తే పండ్లను డైరెక్ట్‌గా తినడం వల్ల ఫైబర్ అందుతుంది. అంతేకాకుండా పండ్లను నేరుగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కూడా సాఫీగా సాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News