BigTV English

Black Nose: ముక్కు నల్లగా మారిపోయిందా? అయితే మీకు ఆ వ్యాధి వచ్చినట్టే, జాగ్రత్త పడండి

Black Nose: ముక్కు నల్లగా మారిపోయిందా? అయితే మీకు ఆ వ్యాధి వచ్చినట్టే, జాగ్రత్త పడండి

Black Nose: మనదేశంలో డెంగ్యూ, చికెన్ గున్యా కేసులు ఎక్కువైపోతున్నాయి. డెంగ్యూని మించి చికెన్ గున్యా బారిన పడిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు చికెన్ గున్యాలో కొత్త లక్షణం బయటపడింది.


చెన్నైలోని నెల రోజుల పసిపాప ముఖంపై నల్లటి మచ్చలు వచ్చాయి. ముఖ్యంగా ముక్కు చుట్టూ నల్లగా మారిపోయింది. వెంటనే ఆమెను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ప్రసవానికి వారం ముందు ఆమె తల్లికి చికెన్ గున్యా ఉన్నట్టు నిర్ధారణ అయింది. ప్రసవ సమయంలో కూడా జ్వరం, కీళ్లనొప్పులు వంటివి ఉన్నాయి. దీంతో చికెన్ గున్యా పసిబిడ్డకు కూడా వ్యాపించింది. కేవలం 15 రోజుల వయస్సులోనే చికెన్ గున్యా బారిన పడింది. చికెన్ గున్యా తగ్గిపోయినప్పటికీ ఆ వ్యాధి కారణంగా వచ్చే హైపర్ పిగ్మెంటేషన్ సమస్య బిడ్డకు వచ్చినట్టు గుర్తించారు వైద్యులు. దీన్నే ‘చిక్ సైన్’ అని కూడా పిలుస్తారు. చికెన్ గున్యా ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే చర్మవ్యాధి ఇది.

ఈ శిశువు కేసుతో ఒక్కసారిగా చికెన్ గున్యా గురించి చర్చ మొదలైంది. ఈ వ్యాధి వల్ల ముఖంపై ఇలా నల్లటి మచ్చలు వస్తాయని నిర్ధారణ అయింది. చికెన్ గున్యాలో కూడా అనేక వేరియెంట్లు పుట్టుకొస్తున్నట్టు కనుగొన్నారు. ఆ వేరియంట్లలో తేడాల వల్లే ఇలా కొత్త కొత్త లక్షణాలు కూడా బయటపడుతున్నాయి.


Also Read: పని, వ్యక్తిగత జీవితాల మధ్య నలిగిపోతున్నారా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే

చికెన్ గున్యా సంకేతాలు

సాధారణంగా చికెన్ గున్యా వచ్చిన వారికి అధిక జ్వరం ఉంటుంది. కీళ్ల నొప్పులు, కాళ్లు నొప్పులు అధికంగా ఉంటాయి. చేతులు, కాళ్లు భుజాలు, పాదాల్లో నొప్పి పుడతాయి. తలనొప్పితో పాటు అలసట, కండరాల నొప్పి కూడా ఉంటుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. జ్వరం తగ్గినా కూడా ముఖంపై ఇలా నల్లబడటం అనేది ఇప్పుడు కొత్తగా తెలిసిన లక్షణం.

కొత్త లక్షణాలు

చికెన్ గున్యా కేసులు మహారాష్ట్రలో ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. పూణేలో ఎంతోమంది చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. అక్కడ చికెన్ గున్యా వైరస్ వల్ల ముక్కు నల్లబడటం, పాక్షిక పక్షవాతం వంటివి కూడా కనిపించాయి. అలాగే ప్లేట్ లెట్ల సంఖ్య కూడా తగ్గినట్టు గుర్తించారు. ఇవన్నీ కూడా చికెన్ గున్యాతో సంబంధంలేని లక్షణాలు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా చికెన్ గున్యా వచ్చిన వారిలో కనిపిస్తున్నాయి.

అయితే ముక్కు నల్లబడడం, ముఖంపై నల్ల మచ్చలు రావడం అనేది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం కాదని చెబుతున్నారు వైద్యులు. చికెన్గున్యా తగ్గిన తర్వాతే ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీనికి కొన్ని రోజులు ఓపిక పట్టినా లేదా మాయిశ్చరైజర్ వంటివి మందులు రాసినాఆ నలుపు రంగు పోతుందని వివరిస్తున్నారు వైద్యులు. అయితే ఈ నలుపు మచ్చలు పోవడానికి ఒక్కోసారి ఆరు నెలల సమయం పడుతుందని అంతవరకు ఓపిగ్గా ఉండాలని చెబుతున్నారు. అరుదైన సందర్భాల్లో చికెన్ గున్యా గుండె సమస్యలకు, జీర్ణాశయాంతర సమస్యలకు, నరాల ప్రాబ్లమ్స్ కు కారణం అవుతుందని వివరిస్తున్నారు.

చికెన్ గున్యా బారిన పడకుండా ఉండాలంటే దోమలకు దూరంగా ఉండాలి. మీ ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. చెత్తను ఇంటికి దగ్గరలో పడేయకండి. కేవలం దోమల వల్లే ప్రాణాంతక రోగాలు ఎన్నో వ్యాప్తి చెందుతున్నాయి.

Related News

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Big Stories

×