BigTV English
Advertisement

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Bigg Boss 8 Telugu Promo: విష్ణుప్రియాకు నైనికా వెన్నుపోటు, సీత చేతికి ఆయుధం.. ఈసారి చీఫ్ అయ్యేది ఎవరు?

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయినప్పుడే ఈ సీజన్‌లో హౌస్‌కు కెప్టెన్స్ అనేవారు ఉండరని క్లారిటీ ఇచ్చేశారు నాగార్జున. కానీ కెప్టెన్స్ లేకపోయినా హౌస్‌కు చీఫ్స్ ఉంటారని క్లారిటీ ఇచ్చారు. అలా చీఫ్స్ స్థానం కోసం బిగ్ బాస్ హౌస్‌లో పోటీలు మొదలయ్యాయి. సీజన్ 8 ప్రారంభం అయినప్పటి నుండి పలువురు చీఫ్స్ మారుతున్నా కూడా నిఖిల్ మాత్రమే ఇంకా ఆ స్థానాన్ని కాపాడుకొని ముందుకు కొనసాగుతున్నాడు. ఇప్పుడు తనతో పాటు హౌస్‌కు మరో చీఫ్‌‌ను ఎంచుకునే సమయం వచ్చేసింది. అదంతా కంటెస్టెంట్స్ చేతుల్లోనే ఉంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


మణికంఠ వద్దు

‘‘ఇప్పుడు రెండో చీఫ్‌ను ఎంపిక చేసుకునే సమయం వచ్చేసింది. 10 బొమ్మలు మీ ముందు పెట్టబడి ఉన్నాయి. అందులో నుండి చివరివరకు ఏ సభ్యుడి బొమ్మ అయితే పగలకుండా ఉంటుందో వారే కాంతార టీమ్‌కు చీఫ్ అవుతారు’’ అంటూ బిగ్ బాస్ వివరించడంతో ప్రోమో ప్రారంభమయ్యింది. ఈ చీఫ్ టాస్క్ కోసం గార్డెన్ ఏరియాలో ఒక సుత్తి పెట్టబడి ఉంటుంది. బజర్ మోగినప్పుడు ముందుగా ఆ సుత్తిని ఎవరు అందుకుంటారో.. వారే దానిని ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేయాలి. అలా మొదటి బజర్ మోగగానే సుత్తిని అందుకున్న ఆదిత్య ఓం.. దానిని పృథ్వికి ఇచ్చాడు. పృథ్వి వచ్చి ఆ సుత్తితో మణికంఠ బొమ్మ పగలగొట్టాడు.


Also Read: వామ్మో చంద్రముఖినే ఏడిపించారుగా.. ఈ యాంగిల్ అసలు ఎక్సపెక్ట్ చేయలేదు భయ్యా..!

మరోసారి నో ఛాన్స్

‘‘టీమ్‌ను కాపాడే అంత శక్తి నీలో లేదు’’ అంటూ మణికంఠకు చీఫ్ అయ్యే ఛాన్స్‌ను దూరం చేశాడు పృథ్వి. మరో రౌండ్‌లో సుత్తి కోసం నిఖిల్, ఆదిత్య ఓం పోటీపడగా అది నిఖిల్ చేతికి వచ్చింది. దీంతో దానిని సీతకు ఇచ్చాడు. తను యష్మీ బొమ్మ పగలగొట్టింది. ‘‘గెలవాలన్న ఆలోచన నేను ఇప్పటికే చూశాను. నువ్వు చీఫ్‌గా ఎలా రూల్ చేస్తావో చూశాను. ఇంకెవరిని అయినా ఆ స్థానంలో చూడాలని అనుకుంటున్నాను’’ అని కారణం చెప్పింది. ఆ తర్వాత సుత్తి కోసం అందరూ పోటీపడినా అది మళ్లీ నిఖిల్ చేతికే వెళ్లింది. దీంతో ఈసారి ఆ సుత్తిని సోనియా చేతికి ఇచ్చాడు. వెంటనే సోనియా వచ్చి నబీల్ బొమ్మ విరగ్గొట్టింది.

ఫ్రెండ్సే కదా

‘‘నేను నీలో లీడర్‌షిప్ లక్షణాలు ఎప్పుడూ చూడలేదు’’ అంటూ నబీల్ చీఫ్ అవ్వకపోవడానికి కారణం చెప్పింది సోనియా. ఆ తర్వాత వచ్చిన నైనికా.. విష్ణుప్రియా బొమ్మను పగలగొట్టింది. ‘‘చీఫ్ స్థానం దక్కించుకోవాలని ఆసక్తి నీకు కొంచెం తక్కువ ఉంది’’ అంటూ కారణం చెప్పింది. దీంతో నైనికా, విష్ణుప్రియా బెస్ట్ ఫ్రెండ్స్ అయినా కూడా తను ఎందుకు ఇలా చేసిందంటూ ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పృథ్విరాజ్ సుత్తిని దక్కించుకొని సీతకు ఇచ్చాడు. తను నైనికా బొమ్మ పలగొడుతూ ఆల్రెడీ చీఫ్ అయ్యిందనే కారణం చెప్పింది. ‘‘ప్రేరణకు, నాకు ఒక ఛాన్స్ కావాలి’’ అంటూ చీఫ్ అయ్యే కోరికను బయటపెట్టింది సీత.

Related News

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Big Stories

×