Basil Seeds: తులసి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మతపరమైన ప్రాముఖ్యత కారణంగా.. తులసి మొక్క దాదాపు ప్రతి ఇంట్లో పెంచుకుంటారు. ఆయుర్వేదంలో తులసి ఆకులకు ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. తులసి ఆకులు ఆకులు కూడా ఆరోగ్య సమస్యలను దూరం చేస్తాయి. తులసి చెట్టు ఏపుగా పెరిగినప్పుడు వీటి గింజలు కూడా రావడం ప్రారంభం అవుతువది. అయితే మొక్క యొక్క సరైన ఎదుగుదల కోసం వాటిని కట్ చేస్తుంటారు. కానీ ఈ విత్తనాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు వీటిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. మరి తులసి గింజల యొక్క ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడంలో సహాయపడతాయి:
మీ బరువు పెరుగుతుందని మీరు ఆందోళన చెందుతుంటే గనక తులసి గింజలు మీకు చాలా సహాయపడతాయి. వీటిలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇదే కాకుండా తులసి గింజలలో శరీరంలో ఫైబర్ లాగా పనిచేస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా జీవక్రియ స్థాయిని పెంచుతుంది. తులసి గింజలను రాత్రిపూట నానబెట్టిన గోరువెచ్చని నీటితో ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల మొండి కొవ్వును కరుగుతువంది.
సహజ రోగనిరోధక శక్తి బూస్టర్‌గా పని చేస్తాయి:
తులసి గింజలలో యాంటీబయాటిక్, యాంటీవైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా ఇది సహజ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు వంటి అనేక సీజనల్ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. దీని కోసం కడాయిలో కాస్త వేడి నీటిని మరిగించి తులసి ఆకులు, ఎండుమిర్చి, అల్లం, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఉడికించాలి. మరుగుతున్నప్పుడు, గ్యాస్‌ను ఆపివేసి, దానికి కొన్ని చుక్కల నిమ్మరసం వేసి త్రాగాలి. ఈ పానీయం సహజంగా మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
మలబద్ధకం నుండి ఉపశమనాన్ని అందిస్తాయి:
మలబద్ధకం నుండి ఉపశమనం అందించడంలో తులసి గింజలు కూడా చాలా సహాయపడతాయి. ఇవి మంచి మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటాయి. అంతే కాకుండా అనేక కడుపు సంబంధిత వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం తులసి గింజలను రాత్రంతా నానబెట్టండి. తర్వాత వాటిని వేడి నీటిలో వేసి, ఒక చెంచా తేనె వేసి, ఉదయాన్నే తాగాలి. ఈ ఆయుర్వేద పానీయం దాదాపు ప్రతి కడుపు సంబంధిత సమస్య నుండి ముఖ్యంగా మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో మీకు సహాయపడుతుంది.
జుట్టు, చర్మం కోసం ఉపయోగించండి:
తులసి గింజలను జుట్టు, చర్మానికి కూడా ఉపయోగించవచ్చు. తులసి పువ్వులు, ఆకులను నూనెలో కలిపి అప్లై చేయడం వల్ల చుండ్రు, దురద, స్కాల్ప్ ఇన్ఫెక్షన్ వంటి జుట్టు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా తులసి గింజలలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో, మొటిమల వంటి చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇందుకోసం అలోవెరా జెల్ లేదా పసుపుతో తులసి గింజలను మిక్స్ చేసి స్కిన్ స్క్రబ్ లా ఉపయోగించవచ్చు.
Also Read: మీరూ ఈ కూరగాయలు తింటున్నారా ? అయితే కిడ్నీ స్టోన్స్ గ్యారంటీ
సైనస్, మైగ్రేన్‌లో కూడా సహాయపడతాయి:
మీకు సైనస్ సమస్య ఉంటే, తులసి గింజలు కూడా మీకు సహాయపడతాయి. దీని కోసం, తులసి గింజలను బాగా గ్రైండ్ చేసి, వాటికి కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ జోడించండి. ఈ మిశ్రమాన్ని వాసన చూస్తే సైనస్ సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు. ఇదే కాకుండా, మీకు మైగ్రేన్ , తలనొప్పి వంటి సమస్యలు ఉంటే ఈ రెసిపీ మీకు కొంత ఉపశమనాన్ని అందిస్తుంది.