BigTV English

Kidney Stones: మీరూ ఈ కూరగాయలు తింటున్నారా ? అయితే కిడ్నీ స్టోన్స్ గ్యారంటీ

Kidney Stones: మీరూ ఈ కూరగాయలు తింటున్నారా ? అయితే కిడ్నీ స్టోన్స్ గ్యారంటీ

Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువగా మనం తీసుకునే ఆహారం వల్ల వస్తుంది. అందుకే ఈ రోజు మనం మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరిచే కొన్ని కూరగాయల గురించి తెలుసుకుందాం. మీకు ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండండి.


బాధ అనుభవించిన వాడికి మాత్రమే కిడ్నీలో రాళ్ల బాధ అర్థం అవుతుంది. అది ఎంత భయంకరంగా ఉందంటే ఒక నిమిషం కూడా భరించలేని నొప్పి కలుగుతుంది.
ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడడం అనేది చాలా సాధారణ సమస్యగా మారింది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి గల అనేక కారణాలలో ఒకటి మన తప్పుడు ఆహారపు అలవాట్లు అంతే కాకుండా జీవనశైలి. కిడ్నీలో రాళ్ల సమస్యను నివారించాలనుకుంటే తగినంత నీరు త్రాగటంతోపాటు, మీ ఆహారంపై కూడా శ్రద్ధ వహించండి. ఇదిలా ఉంటే మనం తినే కొన్ని రకాల కూరగాయలు కూడా కిడ్నీ స్టోన్స్ కి కారణం అవుతాయి. మరి కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే కూరగాయల గురించి.. దీంతో పాటు, మీకు ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉంటే, మీరు ఎలాంటి కూరగాయలను తినకుండా ఉండాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసకుందాం.

బచ్చలికూర:


బచ్చలికూర తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. కానీ దేనిని అతిగా తీసుకోవడం మంచిది కాదని అంటారు. కాబట్టి,బచ్చలికూర ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలో తీసుకోవాలి. నిజానికి, బచ్చలికూరలో ఆక్సలేట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఈ ఆక్సలేట్ కారణం అవుతుంది. మీకు ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే లేదా భవిష్యత్తులో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనుకుంటే,బచ్చలికూరతో పాటు పాలకూరను పరిమిత పరిమాణంలో మాత్రమే తినండి.

బెండకాయ:
రుచికరమైన బెండకాయ మన శరీరానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ , అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి . అయితే, ఈ పోషకాలన్నీ కాకుండా, బెండకాయలో ఆక్సలేట్ పరిమాణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బెండకాయ గింజలలో కూడా ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. అందుకే బెండకాయలను ఎక్కువగా తినడం వల్ల రాళ్ల సమస్య వచ్చే ప్రమాదం ఉంది. మీకు ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే, మీరు వీటిని తక్కువగా తినాలి.

టమాటో:

దాదాపు ప్రతి కూరగాయలలో ఉండే టమాటో మిమ్మల్ని కిడ్నీ స్టోన్ పేషెంట్‌గా కూడా తయారు చేస్తుంది. వాస్తవానికి, టమోటా విత్తనాలలో ఆక్సలేట్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా పచ్చి టమాటోలను రెగ్యులర్ గా తింటే ఈ సమస్య వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ.

దోసకాయ:
సలాడ్‌లో విరివిగా తినే దోసకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ వీటిని ఎక్కువగా తినడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నిజానికి, దోస గింజలలో ఆక్సలేట్ సేంద్రీయ సమ్మేళనం చాలా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. మీకు ఇప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే.. మీరు దోసకాయలను తక్కువగా తీసుకోవాలి.

Also Read: నేచురల్‌గా మెరిసిపోవాలంటే.. ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి

బంగాళదుంప, సోయాబీన్:

నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ యొక్క నివేదిక ప్రకారం, రోజు తినే కొన్ని కూరగాయలలో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మూత్రపిండాల్లో రాళ్లను పెంచుతాయి. వీటిలో బంగాళాదుంప, సోయాబీన్ కూడా ఉన్నాయి. మీరు వీటిని ప్రతిరోజు తీసుకుంటే, అవి మీ మూత్రపిండాలకు హానికరం. ఇదే కాకుండా ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు బంగాళదుంపలు, సోయాబీన్‌లను తినకుండా ఉండటం బెటర్.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×