BigTV English
Advertisement

Cucumber Benefits: కీరదోసకాయ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Cucumber Benefits: కీరదోసకాయ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Cucumber Benefits: చాలామంది కీరదోసకాయను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కీరదోస కాయ తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీనిని తరుచుగా తినడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి కీరదోసకాయ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


ఎముకలు బలంగా తయారవుతాయి :
కీరదోసకాయలో విటమిన్ కె, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. కీరదోసకాయను తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. అంతే కాకుండా ఎముకలు విరిగే ముప్పు కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది:
దోసకాయను పచ్చిగా, వండుకొని కూడా తినవచ్చు. వీటిని ఎలా తీసుకున్నా కూడా శరీరానికి అద్భుతమైన పోషకాలు అందుతాయి. 96% నీరు ఇందులో ఉంటుంది. దోసకాయ తినడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


జీర్ణక్రియ మెరుగుదల:
దోసకాయలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను సక్రమంగా జరిగేలా చేస్తుంది. దీనిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే మలబద్ధకంతో బాధపడే వారికి ఇది మంచి ఆహారం. తరచుగా డైట్‌లో భాగంగా దోసకాయలు చేర్చుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.

బరువు తగ్గుతారు:
దోసకాయలో క్యాలరీలు, పిండి పదార్థాలు , చెక్కరలు తక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయి. దోసకాయలో ని పీచు పదార్థం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దీనివల్ల తొందరగా ఆకలి కూడా వేయదు. ఫలితంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని ఓ పరిశోధనలో కూడా వెళ్లడైంది. తరుచుగా దోసకాయ సలాడ్ తినడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతారు.

రక్తంలోని చక్కర స్థాయిలు అదుపులో:
మధుమేహ వ్యాధితో బాధపడే వారికి కీరదోస మంచి ఆహారం అని చెప్పాలి. దోసకాయలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌ను నెమ్మదిగా కలిసేలా చేస్తుంది. అంతేకాకుండా షుగర్ వ్యాధితో బాధపడే వారికి ఇది మంచి ఆహారం. తరుచుగా కీరదోసకాయ తినడం వల్ల రక్తంలోని చెక్కర స్ధాయిలు తగ్గుతాయి.

Also Read: పొద్దున్నే నిద్ర లేవాలని అలారం పెడుతున్నారా..? ఈ విషయం తెలిస్తే షాకవుతారు !

క్యాన్సర్ నివారణ:
దోసకాయలో సీబీయూ అనే రసాయనం పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా నిర్మూలిస్తుంది. అంతే కాకుండా దోసకాయ తరచుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ రాకుండా చేయడానికి కీరదోసకాయ ప్రభావవంతంగా ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యం:
మన శరీరంలో సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. దోసకాయలో ఉండే పొటాషియం, సోడియం రక్తపోటు పెరగకుండా చేస్తుంది. దోసకాయలో ఉండే పోషకాలు రక్తనాళాల్లో కొవ్వు ఏర్పడకుండా చూస్తాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరుచుగా కీర దోసకాయ తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Let them go: వెళ్లేవాళ్లని వెళ్లనివ్వండి బాసూ.. లేదంటే మనసును బాధపెట్టినవాళ్లవుతారు!

Foot Massage: ఏంటీ.. త‌ర‌చూ ఫుట్ మ‌సాజ్ చేసుకుంటే ఇన్ని లాభాలా!

Hair Thinning: జుట్టు పలచబడుతోందా ? అయితే ఈ ఆయిల్స్ వాడండి !

Jamun Seeds Powder: నేరేడు విత్త‌నాల పొడిని ఇలా వాడారంటే.. ఎలాంటి రోగమైన పారిపోవాల్సిందే!

Perfume in car: కారులో పెర్ఫ్యూమ్ వాడడం ఎంత ప్రమాదకరమో తెలిస్తే ఇప్పుడే తీసి పడేస్తారు

Water: రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీరు తాగే.. అలవాటు మీలో ఉందా ?

Blue number Plates: ఏ వాహనాలకు బ్లూ నెంబర్ ప్లేట్లు ఉంటాయి? 99 శాతం మందికి తెలియదు

Parenting Tips: మీ పిల్లలు అన్నింట్లో ముందుండాలా ? ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వండి !

Big Stories

×