Health Benefits of Dark Chocolate: చాక్లెట్ ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. చాక్లెట్ చూస్తే చాలు.. నోట్లో నీళ్లీరుతాయి. మనసు దానివైపు పరుగులు పెడుతుంది. చాక్లెట్ రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. అయితే ఏదైనా మితిమీరి తింటే అనారోగ్యానికి దారితీస్తుంది. తగిన మోతాదులో తినాలి. అప్పుడు వాటికున్న పోషకాలు అందుతాయి.. ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాని రుచి బాగుంది కదా అని అతిగా తింటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే డార్క్ చాక్లెట్ తినడం చాలా ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డార్క్ చాక్లెట్ ప్రయోజనాలు
డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సీడెంట్లు అధికంగా ఉన్నాయి. ఇవి ఒత్తిడిని తగ్గించండంలో తోడ్పడతాయి. యాంటీ ఆక్సిండెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి కాన్సర్, వాపు వంటి అనేక సమస్యలను నివారించడంలో తోడ్పడతాయి. డార్క్ చాక్లెట్ తినడం వల్లన గుండెకు చాలా మంచిది. డార్క్ చాక్లెట్‌లో ఉండే పాలీఫెనాల్స్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాదు చర్మ సౌందర్యానికి కూడా చాలా మంచిది.
ఇవి రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ప్రెగ్నెంట్ సమయంలో 30 గ్రాములు డార్క్ చాక్లెట్ తినడం వల్ల పిండం ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఉండే ప్లెవనాయిడ్స్ యూవీ కిరణాల నుండి రక్షణనిస్తాయి. మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
Also Read: ఈ ఫేస్ ప్యాక్‌లు ట్రై చేశారంటే మేకప్ లేకుండానే మెరిసిపోవచ్చు!
డయాబెటీస్ కంట్రోల్ లోకి వస్తుంది
అదేంటి చాక్లెట్ తియ్యగా ఉంటుంది కదా.. డయాబెటిస్‌ని ఎలా కంట్రోల్ చేస్తుందనుకుంటున్నారా.. డార్క్ చాక్లెట్ రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మధుమోహంతో బాధపడేవారు ఈ చాక్లెట్ ని తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ కంట్రోల్ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.