EPAPER

Guava Leaf Tea: ఈ టీతో మీ అనారోగ్య సమస్యలన్నీ పరార్ !

Guava Leaf Tea: ఈ టీతో మీ అనారోగ్య సమస్యలన్నీ పరార్ !

Guava Leaf Tea: జామ కాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. జామ కాయను నేరుగా తినడమే కాకుండా జ్యూస్ చేసుకుని కూడా తాగవచ్చు. ఇదిలా ఉంటే జామ పండుతోనే కాదు జామ ఆకుతో కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. కొందరైతే జామ ఆకులను నేరుగా నమిలి తింటూ ఉంటారు. మరికొందరు జామ ఆకులతో టీ తయారు చేసుకుని త్రాగుతుంటారు. జామ ఆకులతో తయారు చేసిన టీ వల్ల కూడా అనేక లాభాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామాకు టీ వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


జామ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ -సి , లికోపెన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఈ ఆకుల్లో పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల బీపీ లెవల్ కూడా అదుపలో ఉంటుంది. జామ కాయల్లో 80 శాతం నీరు ఉంటుంది. అధిక మోతాదులో వీటిలో ఫైబర్ ఉండటం వల్ల మెటాబాలిజం పెరిగేందుకు తోడ్పడుతుంది.

జామ ఆకు టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..


జలుబు- దగ్గు మాయం:

జామ ఆకులో విటమిన్ -సి, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు నుంచి రక్షణ కల్పిస్తాయి. జామాకుతో తయారు చేసిన టీని వేడిగా ఉన్నప్పుడే తాగడం వల్ల కఫం కూడా తగ్గుతుంది. ఇది గొంతు, ఊపిరితిత్తులను శుభ్రం చేసి జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకునేలా చేస్తుంది. జామ ఆకులతో టీ కాచుకుని తాగితే వైరల్ సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

డయాబెటిస్:

డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారికి జామ ఆకులతో తయారు చేసిన టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి ఆహారం తిన్న తర్వాత దీనిని తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గే అవకాశం ఉంటుంది. శరీరంలో ఉండే సుక్రోజ్, మాల్టోజ్ లను శోషించుకునే గుణం దీనిలో ఉంటుంది. అంతే కాకుండా ఇందులోని ఎంజైములను జీర్ణాశయంలో ఉన్న కార్బోహైడ్రేట్స్‌ను గ్లూకోజ్‌గా మారుస్తుంది.

Also Read: కీరదోసకాయ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

చెడు కొలెస్ట్రాల్ :

కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో జామాకు టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది. అంతే కాకుండా ఇతర సమస్యలను నివారిస్తుంది. జామ ఆకులతో తయారు చేసిన టీ 8 నుంచి 9 వారాల పాటు తాగడం వల్ల శరీరంలో మార్పులను చూడవచ్చు.

చర్మ ఆరోగ్యం:

జామ ఆకు టీ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మంపై మొటిమలు తగ్గించడానికి ఉపయోగపడే విటమిన్ -సి జామ ఆకు టీలో పుష్కలంగా ఉంటుంది. ఈ టీ తరుచుగా తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

డయేరియా:

శరీరంలో డయేరియాకు కారణం అయ్యే స్టాఫీలోకోక్కస్ అరెస్ బ్యాక్టీరియా పెరుగుదను జామాకులతో తయారు చేసిన టీ అరికడుతుంది. డయేరియాతో బాధపడే వ్యక్తులు ఎవరైనా మెడిసిన్ తో పాటు జామ ఆకులతో టీ తాగితే విరేచనాలు తగ్గి కడుపు నొప్పి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

(గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Tags

Related News

Pasta Kheer: పాస్తా పాయసాన్ని ఇలా వండారంటే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు

Coffee face mask: కాఫీ పొడితో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న టాన్ మొత్తం పోతుంది, మెరిసిపోతారు

Bone Health: ఎముకలకు ఉక్కు లాంటి బలాన్నిచ్చేవి ఇవే !

Tea: ఎక్కువగా టీ తాగుతున్నారా ? ఎంత ప్రమాదమో తెలుసుకోండి

Coconut Water: కొబ్బరి నీరు తాగుతున్నారా ? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి

Sleeping: నిద్ర లేమి సమస్యకు చెక్ పెట్టండిలా ?

Kumkum: ఇంట్లోనే కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా ?

Big Stories

×