Manu Bhaker on Neeraj Chopra: పారిస్ ఒలింపిక్స్ లో మను బాకర్.. షూటింగ్ లో రెండు పతకాలు సాధించింది. అలాగే నీరజ్ కూడా రజత పతకం సాధించాడు. అయితే వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు ఒక్కసారి గుప్పుమన్నాయి. అవన్నీ ఉత్తుత్తినే అందరూ కొట్టిపారేశారు. ఇక మను తండ్రి రాంకిషన్ అయితే, తనింకా చిన్నపిల్ల అని, ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు. తర్వాత నీరజ్ వైపు బంధువులు కూడా కొంత ఘాటుగానే స్పందించారు.
సరే, రెండు కుటుంబాల మధ్య అంత సయోధ్య లేదని అంతా అనుకున్నారు. వీరి జోలికి వెళ్లడం మానేశారు. కానీ ఇటీవల మనుబాకర్ ఒక ఇంగ్లీష్ ఛానల్ ఎన్డీటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. వాళ్లడిగిన ప్రశ్న ఏమిటంటే, ఒలింపిక్స్ లో ఎన్నో దేశాల వాళ్లు చరిత్ర స్రష్టించారు. వారిలో కొంతమందితోనైనా మాట్లాడి ఉంటారు కదా.. అందులో ప్రత్యేకమైనది ఏమైనా ఉందా? అని అడిగారు.
దీంతో మను బాకర్ వెళ్లెళ్లి.. కథను అక్కడికే తీసుకొచ్చింది. ఎక్కడకంటే.. అదేనండీ నీరజ్ దగ్గరికే తీసుకొచ్చింది. తనతో మాట్లాడిన మాటలే నాకు ప్రత్యేకమైనదని తెలిపింది. ఇంకా ఏమని చెప్పిందంటే.. నీరజ్ ఎందరికో స్ఫూర్తినిచాడని తెలిపింది. ఒత్తిడిలో ఎలా ఆడాలో తను చెప్పిన టెక్నిక్స్ నాకెంతో పనిచేశాయని తెలిపింది.
ఎంతో ప్రతిభావంతులు మనచుట్టూ ఆడుతున్నప్పుడు ఎంత మానసిక బలంతో ఉండాలి, ఎంత ఆత్మవిశ్వాసంతో ఉండాలి? ఇలాంటి ఎన్నో విషయాలు తెలియజేశాడని తెలిపింది. ఆ మాటలు నన్నెంతో ప్రభావితం చేశాయని కూడా పేర్కొంది. అథ్లెట్లుగా మేం ఒకలాంటి అనుభవాలను, సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు అర్థమైందని తెలిపింది.
Also Read: ఎవరైనా గాయపడితేనే.. సర్ఫరాజ్ కి చోటు?
అయితే, మీ ఇద్దరు ఇంత విపులంగా, వివరంగా మాట్లాడుకున్నారా? అని నెటిజన్లు అప్పుడే ప్రశ్నలు వేస్తున్నారు. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే, వీరిద్దరి మధ్యా ఏదో ఉందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఇకపోతే తను షూటర్ కాకపోతే, టీచర్ అయ్యేదాన్నని మను తెలిపింది. అన్నింటికి మించి పిజ్జా అంటే చాలా ఇష్టమని, కానీ ఫిట్ నెస్ రీత్యా అంత ఎక్కువ తీసుకోకూడదని తెలిపింది. ఎక్కువ తింటే, ఎక్కువ ఎక్సరసైజ్ లు చేయాలని నవ్వుతూ తెలిపింది.
ఇక తెల్లవారుజామునే లేవడం కాన్ సంట్రేషన్ కోసం యోగా, మెడిటేషన్ విధిగా చేయాల్సిందేనని తెలిపింది. తర్వాత ఎక్సర్ సైజ్ లు చేస్తానని తెలిపింది. రోజూ షూటింగ్ ప్రాక్టీస్ ఉంటుంది. అది శిక్షణలో భాగమని తెలిపింది.
ఇకపోతే బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తనకు రోల్ మోడల్ అని తెలిపింది. ఇదంతా బాగానే ఉంది…మరీ నీరజ్ చోప్రా ఎందుకంత స్ఫూర్తి ప్రదాతయ్యాడని నెటిజన్లు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.