BigTV English

Dark Elbows: మోచేతుల నలుపుదనానికి చెక్ పెట్టండిలా !

Dark Elbows: మోచేతుల నలుపుదనానికి చెక్ పెట్టండిలా !

Dark Elbows: మోచేతులు, మోకాళ్లపై నలుపు అనేది చాలా మందిలో ఉండే సమస్య. ఈ చర్మ సమస్య అనేక కారణాల వల్ల రావచ్చు. శరీరాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోయినా, మోచేతులు , మోకాళ్లపై నలుపు కనిపించడం ప్రారంభమవుతుంది. మోచేతుల నలుపు కొన్నిసార్లు ఇబ్బందికి కారణమవుతుంది. మోచేతుల నల్లదనాన్ని తొలగించే పద్ధతులను అనుసరించడంలో మీరు విఫలమైతే, కనక కొన్ని హోం రెమెడీస్ మీకు ఈ సమస్యను వదిలించుకోవడానికి సహాయపడతాయి.


ఈ హోం రెమెడీస్ చర్మంపై నల్లదనాన్ని తొలగించడమే కాకుండా చర్మానికి మెరుపును తెస్తాయి. మరి హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకోవాలి. వాటి యొక్క ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మోచేతులు, మోకాళ్ల నలుపును తగ్గించే హోం రెమెడీస్:


బేకింగ్ సోడా: 1 చెంచా బేకింగ్ సోడాలో 2 చెంచాల పాలు లేదా పెరుగు కలిపి పేస్ట్ చేయండి. దీన్ని మోచేయిపై అప్లై చేసి 10-15 నిమిషాల పాటు ఉంచి, తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి. ఇది మోచేతులతో పాటు మోకాళ్ల యొక్క నలుపు దనాన్ని తొలగిస్తుంది. అంతే కాకుండా మెరిసేలా చేస్తుంది.

నిమ్మకాయ: సగం నిమ్మకాయను కోసి దానితో నలుపు ఉన్న చోట మోచేతులపై రుద్దండి. 10 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా రోజుకు రెండుసార్లు చేయండి. నిమ్మకాయపై పేస్ట్ పెట్టి నలుపు ఉన్న చోట రాసినా కూడా మంచి ఫలితం ఉంటుంది.

బంగాళాదుంప: బంగాళాదుంపను కట్ చేసి దాని నుండి రసం తీయండి. ఆ రసాన్ని మోచేతులపై రాసి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. రోజు చేయండి.

పసుపు: 1 టీస్పూన్ పసుపు పొడిని 1 టీస్పూన్ తేనె లేదా పాలు కలిపి పేస్ట్ చేయండి. దీన్ని మోచేయిపై అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి, తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయండి.

Also Read: మీ చర్మం క్రమంగా నల్లగా మారుతోందా.. కారణాలివే!

కొబ్బరి నూనె: ప్రతిరోజు నిద్రపోయే ముందు కొబ్బరి నూనెను మోచేతులపై రాసి మసాజ్ చేయండి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి:

రోజు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి. అంతే కాకుండా క్రమం తప్పకుండా స్క్రబ్ చేయండి. నీరు పుష్కలంగా త్రాగాలి. ఈ చర్యలను అనుసరించడం ద్వారా, మోచేతులపై ఉన్న నలుపు క్రమంగా తగ్గుతుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×